Balapur Ganesh Laddu: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రికార్డు ధర – గతేడాదికంటే రూ.4.99 లక్షలు అధికం

Balapur Ganesh Laddu: భాగ్యనగరంలో అత్యంత ఆసక్తి రేపే ఉత్సవ సంప్రదాయాల్లో ఒకటి బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట. ప్రతి ఏడాది లడ్డూ వేలంలో కొత్త రికార్డులు సృష్టించడం ఆనవాయితీగా మారింది. ఈసారి కూడా ఆ సంప్రదాయం కొనసాగింది.

Balapur Ganesh Laddu: 2025లో జరిగిన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటలో ఈసారి రూ.35 లక్షలు పలికింది. గతేడాది రూ.30 లక్షల 1వేలతో పోలిస్తే ఈసారి రూ.4 లక్షల 99వేలు అధికం. రికార్డు స్థాయిలో జరిగిన ఈ వేలంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

లడ్డూ వేలం పాటలో మొత్తం 38 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. చివరికి లింగాల దశరథ్ గౌడ్ లడ్డూను రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది లడ్డూ కొనుగోలు చేసిన కొలన్ శంకర్ రెడ్డిను అధిగమిస్తూ ఈసారి దశరథ్ గౌడ్ విజేత అయ్యారు.

ఇది కూడా చదవండి: Ganesh Laddu Auction: ఆల్ టైం రికార్డ్.. హైదరాబాద్‌లో గణేష్ లడ్డూ రూ.2.32 కోట్లకు అమ్ముడు!

1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన ఈ వేలం పాట ఇప్పుడు కోట్ల రూపాయల స్థాయికి చేరుకోవడం గమనార్హం. అప్పటి నుండి బాలాపూర్ గణేష్ ఉత్సవాలు పార్టీలకు అతీతంగా నిర్వహించబడుతున్నాయి.

ఈ వేడుకకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ, “బాలాపూర్‌లో పుట్టిన వారు నిజంగా అదృష్టవంతులు. ఈ మహేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం గర్వకారణం” అని అన్నారు.

ప్రతి ఏటా లడ్డూ ధర పెరుగుతూ రావడం గణనాథుడి భక్తుల భక్తిశ్రద్ధలకు నిదర్శనం. బాలాపూర్ లడ్డూ కేవలం ప్రసాదం కాదు, అదృష్టానికి సంకేతం అని భక్తులు విశ్వసిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *