Chandra Grahanam: ఆదివారం జరిగే చంద్ర గ్రహణం నేపథ్యంలో గర్భిణి మహిళల్లో ఆందోళన పెరుగుతోంది. గ్రహణం రోజున బయటికి వెళ్ళకూడదనే నమ్మకాలతో పాటు, సిజేరియన్ ప్రసవాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్న సందర్భాలు పెరిగాయి.
Chandra Grahanam: సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:58 గంటలకు ప్రారంభమయ్యే చంద్ర గ్రహణం, దాదాపు 3 గంటల 28 నిమిషాల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎనభై రెండు నిమిషాలపాటు కొనసాగే ఈ అరుదైన చంద్రగ్రహణం గురించి పలు ప్రచారాలు, విశ్వాసాలు ఉన్నాయి. ముఖ్యంగా, గ్రహణ సమయంలో జన్మించే శిశువులు అనారోగ్యంతో పుడతారనే అపోహ గర్భిణిలను, వారి కుటుంబాలను మరింతగా భయపెడుతోంది.
ఇది కూడా చదవండి: Khairatabad Ganesh Immersion: భక్తుల కోలాహలం మధ్య ముగిసిన ఖైరతాబాద్ మహా గణపతి నిమర్జనం!
గైనకాలజీ ఆసుపత్రుల్లో ప్రస్తుతం సిజేరియన్ ప్రసవాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఎమర్జెన్సీ పేషెంట్లు మినహా మిగతా వారు సిజేరియన్ వాయిదా వేసుకుంటున్నారు. గ్రహణ సమయంలో శస్త్రచికిత్స చేయవద్దంటూ కుటుంబ సభ్యులు డాక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో, డాక్టర్లు కూడా పేషెంట్ చెప్పిన సమయానికే సిజేరియన్లు చేస్తున్నారు.
చాలా ఆసుపత్రుల్లో చంద్ర గ్రహణం రోజు ప్రసవాల సంఖ్య తగ్గింది. నార్మల్ డెలివరీలు తప్ప మిగతా సిజేరియన్లు ఎక్కువగా వాయిదా వేస్తున్నారు. అలాగే, ఇప్పటికే ప్రసవించిన మహిళలు కూడా గ్రహణం రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం మానేశారు.
ఈ విశ్వాసాలను డాక్టర్లు పూర్తిగా ఖండిస్తున్నా, పేషెంట్ల అభ్యర్థన మేరకు సిజేరియన్లు వాయిదా వేస్తున్నామని చెబుతున్నారు. “ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రం గ్రహణం సంబంధం లేకుండా ప్రసవం చేస్తాం. కానీ చాలామంది విశ్వాసాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు” అని గైనకాలజిస్ట్లు చెబుతున్నారు.
