Collector Surprise Inspection: ఆకస్మిక తనిఖీతో హల్‌చల్.. విద్యార్థులకు భోజనం వడ్డించిన యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు!

Collector Surprise Inspection: విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని విశ్వసించే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, తన పనిలో వినూత్న ఆలోచనలు, చర్యలతో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే ఆయన పాఠశాలల్లో చాక్‌పీస్ పట్టి విద్యార్థులకు పాఠాలు చెప్పడం, హాస్టల్లో గరిటె పట్టి భోజనం వడ్డించడం ద్వారా అందరి ప్రశంసలు పొందారు.

Collector Surprise Inspection: జిల్లా కలెక్టర్ తరచుగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యమైనదిగా ఉందో లేదో స్వయంగా పరిశీలిస్తున్నారు. ఆహారంలో లోపాలు ఉన్నా, మెనూ ప్రకారం భోజనం అందించకపోయినా సంబంధిత సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: High Court: భక్తుల రక్షణకు నడకదారిలో ఇనుప కంచె ఏర్పాటు చేయండి.. హైకోర్టు ఆదేశాలు

తాజాగా భువనగిరి పట్టణంలోని కేజీబీవీ స్కూల్, కాలేజీ హాస్టల్‌ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా పరిశీలించారు. రోజు మెనూలో ఉండాల్సిన టమాట, గుడ్డు కర్రీ ఎందుకు తయారు చేయలేదని ఆయన సిబ్బందిని ప్రశ్నించారు. గుడ్ల సరఫరా ఆలస్యం అవుతోందని చెప్పడంతో సంబంధిత టెండర్‌దారుడికి స్వయంగా ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆహార నాణ్యత, వసతి సౌకర్యాలపై విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులతో విద్యా ప్రమాణాలు, పౌష్టికాహారం గురించి చర్చించారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో నిలవాలని, గురువులకు, తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులను కలెక్టర్ ప్రోత్సహించారు.

విద్యార్థులను చదువుపై దృష్టి పెట్టించే లక్ష్యంతో కలెక్టర్ హనుమంతరావు ‘మేలుకొలుపు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రయత్నం ద్వారా జిల్లా విద్యా వ్యవస్థలో క్రమశిక్షణ, నాణ్యతను పెంపొందించాలన్నది ఆయన లక్ష్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *