PM Modi: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75వ పుట్టినరోజు సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసం రాశారు. సెప్టెంబర్ 11, 1950న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో జన్మించిన భగవత్ గారు, 2009లో సర్సంఘ్చాలక్గా బాధ్యతలు చేపట్టి దాదాపు 16 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ను నడిపిస్తున్నారు. ఆయన 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
PM Modi: మోదీ వ్యాసంలో “మా భారతి సేవలో మోహన్ జీ” అంటూ భగవత్ గారి సేవలను స్ఫూర్తిదాయకంగా వర్ణించారు. ఆయన “వసుధైవ కుటుంబకం” సూత్రాన్ని తన జీవితాంతం ఆచరించారని, సామాజిక పరివర్తనకు, సోదరభావం – సామరస్యానికి అంకితం అయ్యారని ప్రశంసించారు.

వ్యాసంలో మోదీ, స్వామి వివేకానంద 1893లో చేసిన చికాగో ప్రసంగాన్ని, అలాగే 9/11 ఉగ్రదాడులను ప్రస్తావించారు. అదే రోజున జన్మించిన మోహన్ భగవత్ గారు భారతీయ ఆధ్యాత్మిక విలువలను, సార్వత్రిక సోదరభావాన్ని ఆచరణలో నిలబెట్టిన వ్యక్తి అని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Viral: ఆడుకుంటూ రూ.10 కాయిన్ మింగిన బాలుడు.. డాక్టర్ చాకచక్యంతో 2 నిమిషాల్లో ప్రాణ రక్షణ
మోదీ మాట్లాడుతూ, మోహన్ జీ తండ్రి మధుకర్రావు భగవత్తో తనకు ఉన్న అనుబంధాన్ని, ఆయన చేసిన జాతి నిర్మాణ సేవలను గుర్తుచేశారు. ఆ అనుబంధమే మోహన్ భగవత్ గారి లోకసేవ పట్ల ఉన్న నిబద్ధతకు పునాది అయిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో ఆటో డ్రైవర్ గేమింగ్ చైర్తో వైరల్..!
మోదీ వ్యాసంలో భగవత్ గారి ప్రచారక్ జీవితం, అత్యవసర పరిస్థితి సమయంలో చేసిన కృషి, పేదల కోసం చేసిన సేవలు, RSSలో ఆయన తీసుకువచ్చిన మార్పులు, కోవిడ్ కాలంలో సాంకేతిక వినియోగాన్ని ప్రోత్సహించిన తీరు, అలాగే స్వచ్ఛ భారత్, బేటీ బచావో వంటి ప్రజా ఉద్యమాలకు ఇచ్చిన మద్దతు గురించి విశేషంగా రాశారు.
మోదీ చివరగా, మోహన్ జీ వసుధైవ కుటుంబకం సూత్రానికి సజీవ ఉదాహరణ అని పేర్కొంటూ.. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థించారు. RSS శతాబ్ది ఉత్సవాలు జరగబోతున్న ఈ ప్రత్యేక సమయంలో, మోహన్ భగవత్ నాయకత్వం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
