IND vs PAK: టీ20 ఆసియా కప్ 2025లో భారత్–పాకిస్తాన్ మ్యాచ్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ పోరు సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. రెండు జట్లు గెలుపు కోసం పూనుకోవడంతో ఈ పోరుకు ఉత్కంఠ మరింత పెరిగింది.
IND vs PAK: భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా, పాకిస్తాన్కు సల్మాన్ అలీ అఘా కెప్టెన్గా ఉన్నాడు. యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్న ఈ జట్లు తలపడటంతో ఉత్కంఠభరిత క్షణాలు ఖాయం. అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: IND vs PAK: ఆసియా కప్ హిస్టరీలో తొలిసారి.. ఫైనల్లో తలపడనున్న భారత్, పాకిస్తాన్
దుబాయ్ మైదానం గణాంకాల ప్రకారం పాకిస్తాన్కు పైచేయి ఉంది. ఇంతవరకు ఇక్కడ రెండు జట్లు ఆడిన మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో పాకిస్తాన్ రెండు గెలిచింది, భారత్ ఒకదాంట్లో విజయం సాధించింది. 2021లో జరిగిన ప్రపంచ కప్లో పాక్ 10 వికెట్ల తేడాతో గెలవగా, 2022లో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్పై గెలిచింది. అయితే ఈ సంవత్సరం జరిగిన మరో పోరులో పాకిస్తాన్ మళ్లీ ఆధిపత్యం చూపించింది.
మొత్తం టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల గణాంకాలను పరిశీలిస్తే భారత్ పాకిస్తాన్ కంటే బలంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన 13 టీ20ల్లో భారత్ 10 మ్యాచ్లు గెలిచింది. పాకిస్తాన్ కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించింది. అయితే దుబాయ్లో పాకిస్తాన్ రికార్డ్ బలంగా ఉండటం గమనార్హం.
ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 14న జరగబోయే పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్లో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీలో, సోనీ లివ్ యాప్ ఇంకా వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
