Viral Video: మనకు రోజూ శాంతి, భద్రత లభించడానికి అసలు కారణం ఎవరు? దేశ సరిహద్దుల్లో ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా అప్రమత్తంగా నిలబడి దేశాన్ని కాపాడుతున్న సైనికులే. కుటుంబాన్ని దూరం పెట్టి, ప్రాణాలకే తెగించి, దేశ సేవలో తలమునకలయ్యే ఆర్మీ జవాన్ల త్యాగం చెప్పలేనిది. అలాంటి ఒక జవాన్ తన దేశ సేవ ప్రయాణానికి బయలుదేరే సందర్భంలో తల్లితో పంచుకున్న ఆత్మీయ క్షణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: ఇట్క్స్-షిరామ్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో, ఒక తల్లి తన కొడుకును బస్ స్టాండ్ వద్ద వీడ్కోలు పలుకుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఆ జవాన్ దేశ సరిహద్దుకు వెళ్లబోతున్న సమయంలో, తల్లి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తన కొడుకును నుదిటిపై ముద్దు పెట్టి, బుగ్గను తాకుతూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది. ఆ తర్వాత తన కుమారుడితో చేతులు కలిపి, దేశ సేవలో గర్వంగా నిలబడాలని ఆశీర్వదించింది.
ఇది కూడా చదవండి: Viral Video: జై షా–అనురాగ్ ఠాకూర్–షాహిద్ అఫ్రిది కలిసి మ్యాచ్ చూశారా? నిజం ఇదే!
ఆర్మీ జవాన్ తండ్రి, కుటుంబ సభ్యులు ఈ క్షణానికి సాక్షులుగా నిలిచారు. అక్కడే ఉన్నవారు ఈ భావోద్వేగ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాలలో బంధించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్షా నలభై వేల మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు ఈ తల్లి-కొడుకుల మధ్య ప్రేమను గౌరవిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
“అమ్మ.. నువ్వు నిజంగా గొప్పవు, నీ కొడుకు దేశాన్ని కాపాడుతూ గర్వకారణమైన పని చేస్తున్నాడు” అంటూ ఒకరు రాశారు. “ఈ క్షణాన్ని రికార్డ్ చేసినందుకు థాంక్స్” అంటూ మరొకరు పేర్కొన్నారు. కొందరు హార్ట్ సింబల్స్తో తమ అభినందనలు తెలిపారు. ఈ వీడియో దేశం కోసం తమ కుమారులను పంపే తల్లిదండ్రుల త్యాగానికి మరో నిదర్శనంగా నిలుస్తోంది.
View this post on Instagram
