Viral Video: అడవి జీవితం ఎప్పుడూ ఊహించని విధంగా ఉంటుంది. అక్కడ ప్రతి క్షణం కొత్త జననం, కొత్త మరణం చోటుచేసుకుంటుంది. బలహీన జంతువులు బలమైన వాటి ఆహారంగా మారిపోవడం సహజం. సింహం, పులి వంటి వన్యప్రాణులు తమ వేట సామర్థ్యంతో జీవనం సాగిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో బలహీనంగా కనిపించే జంతువుల ధైర్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అలాంటి ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: వీడియోలో ఒక సింహం అడవి గేదెను వేటాడుతుంది. గేదె సింహం ముందు అసాధారణ ధైర్యం ప్రదర్శించింది. సింహం దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, గేదె దానిని ఎదుర్కొని నిలబడి పోరాడింది. కొన్ని క్షణాలు సింహం కూడా వెనక్కి తగ్గినట్లు కనిపించింది. అయితే గేదె ముందుకు కదలగానే సింహం వెనుక నుండి దాడి చేసింది. ఆ తర్వాత మరో సింహం కూడా చేరడంతో గేదెపై దాడి మరింత ఉధృతమైంది. చివరికి గేదె బలహీనపడి సింహాల బారిన పడింది.
ఇది కూడా చదవండి: IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్ హ్యాండ్షేక్ వివాదం.. ఐసీసీ రిఫరీపై పీసీబీ ఫైరింగ్
కేవలం 38 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా, లక్షల మంది ఇప్పటికే వీక్షించారు. వందలాది మంది లైక్స్, కామెంట్స్తో స్పందిస్తున్నారు. “గేదె సింహాన్ని ఎదుర్కొన్న ధైర్యం నిజంగా ప్రశంసనీయమైనది” అని ఒకరు రాస్తే, “అడవిలో ఒంటరిగా సింహాన్ని ఎదుర్కోవడం ఎంతటి సాహసమో ఈ వీడియో చెబుతోంది” అని మరొకరు కామెంట్ చేశారు.
అడవిలో మనుగడ కోసం జరిగే ఈ రక్తికట్టే సంఘటన నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
— Wildlife Uncensored (@TheeDarkCircle) September 14, 2025
