Modi 75th Birthday: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ, వివిధ మతపరమైన కేంద్రాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు సహా దేశవ్యాప్తంగా ఉన్న నేతలు తమ శుభాకాంక్షలను తెలియజేశారు. అంతేకాకుండా, విదేశీ నేతలు, రాయబారులు కూడా తమ ప్రత్యేక సందేశాలను పంపించారు.
Modi 75th Birthday: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీని అభినందిస్తూ ఆయన కృషి, విశిష్ట నాయకత్వం వల్ల దేశంలో మహత్తర లక్ష్యాలను సాధించే సంస్కృతి ఏర్పడిందని అన్నారు. మోదీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలని ఆమె ఆకాంక్షించారు.
भारत के प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। परिश्रम की पराकाष्ठा का उदाहरण प्रस्तुत करते हुए अपने असाधारण नेतृत्व से आपने देश में बड़े लक्ष्यों को प्राप्त करने की संस्कृति का संचार किया है। आज विश्व समुदाय भी आपके मार्गदर्शन में अपना…
— President of India (@rashtrapatibhvn) September 17, 2025
Modi 75th Birthday: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సోషల్ మీడియా వేదిక Xలో మోదీని “దేశం కోసం త్యాగం, తపస్సు, అంకితభావానికి ప్రతీక” అని అభివర్ణించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మోదీని “దార్శనిక నాయకుడు”గా ప్రశంసించి, ఆయన అవిశ్రాంత కృషి భారత్కు కొత్త దిశను చూపిందన్నారు.
PM Shri @narendramodi Ji embodies true leadership, uplifting the marginalized with sensitivity, showing the path to the nation in troubled times, securing the country with steely resolve, and leading India to the highest honors on the global platform. Penned an article for ToI on… pic.twitter.com/BQBxs3s052
— Amit Shah (@AmitShah) September 17, 2025
అలాగే కేంద్ర మంత్రి పియూష్ గోయల్, మోదీ జీవితం మచ్చలేని సేవా పథమని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, “ప్రజల కోసం నిరంతరం కృషి చేసే ప్రధాని మోదీ దేశానికి దొరకడం అదృష్టం” అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధనలో ఆయన మార్గదర్శకత్వం అపూర్వమని అన్నారు.
Honourable Prime Minister Sri. Narendra Modi Ji (@narendramodi)
In your remarkable journey, we see the story of a leader who rose from humble beginnings, through unwavering discipline and commitment, to become the guiding force of our great nation.
Your vision for… pic.twitter.com/5jVjeeJHqu
— Pawan Kalyan (@PawanKalyan) September 17, 2025
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, “ప్రజల పట్ల మీ ప్రేమ, సమర్థ నాయకత్వం ఎంతో ప్రేరణ ఇస్తుంది” అన్నారు. ప్రధాని మోదీ నిండునూరేళ్లు ఆరోగ్యంతో ఉండి దేశానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: Narendra Modi: “మోదీకి గ్యారంటీ”.. సంక్షేమం నుంచి సాంకేతికత వరకు భారత్ అభివృద్ధి ప్రయాణం!
మరోవైపు, ఢిల్లీలో కూడా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. మంత్రి కపిల్ మిశ్రా హనుమాన్ ఆలయంలో పూజలు చేసి హనుమాన్ చాలీసా చదివారు. ఢిల్లీ ప్రభుత్వం “సేవా పఖ్వాడా” కార్యక్రమాన్ని ప్రారంభించి, రక్తదానం శిబిరాలు, ఆరోగ్య సేవల ప్రాజెక్టులను ప్రకటించింది.
ప్రధాని జన్మదినం సందర్భంగా వారణాసిలో గంగా నదికి ప్రత్యేక హారతులు ఇచ్చారు. పూరీకి చెందిన శాండ్ ఆర్టిస్ట్ ప్రత్యేక శిల్పాన్ని రూపొందించి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఈ రోజు మధ్యప్రదేశ్లోని ధార్లో పర్యటించి దేశంలోని తొలి PM మిత్రా పార్క్కు శంకుస్థాపన చేసి “సేవా పఖ్వాడా”ను ప్రారంభించారు.
విదేశీ నేతలు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్, “రష్యా-భారత్ స్నేహాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడంలో మోదీ పాత్ర అమూల్యం” అంటూ హిందీలో పోస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించి, “ధన్యవాదాలు, నా స్నేహితుడు ట్రంప్” అంటూ రిప్లై ఇచ్చారు.
भारत के माननीय प्रधानमंत्री श्री @narendramodi जी को उनके जन्मदिन पर हार्दिक बधाइयाँ और शुभकामनाएँ!
रूस-भारत की दशकों पुरानी मैत्री को नई ऊँचाइयों तक ले जाने में उनके अमूल्य योगदान के लिए हम आभारी हैं।
कामना है कि देश और दुनिया की भलाई करने वाले हर काम में उनको सफलता मिलती रहे।
— Denis Alipov 🇷🇺 (@AmbRus_India) September 16, 2025
ప్రధాని పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టింది. రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు రెండు వారాల పాటు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా “సేవా పఖ్వాడా”ను భారీ స్థాయిలో నిర్వహిస్తూ ప్రజలలో సేవా భావనను పెంపొందించేందుకు బీజేపీ ప్రణాళికలు రూపొందించింది.
Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful resolution of the…
— Narendra Modi (@narendramodi) September 16, 2025
ఇలా దేశం మొత్తం ఒకే తాటిపైకి వచ్చి, ప్రధాని మోదీ 75వ జన్మదినాన్ని మహోత్సాహంగా జరుపుకుంటూ శుభాకాంక్షలతో నింపిపోతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ వేదికల నుండి వచ్చిన ఈ శుభాకాంక్షలు మోదీపై ఉన్న ప్రజాభిమానం, నాయకత్వంపై విశ్వాసాన్ని మరోసారి ప్రతిబింబించాయి.
