Viral Video: తగ్గేదేలే.. విమానంలో టీ కోసం వివాదం, ప్రయాణికుడిని చితకబాదిన మహిళ!

Viral Video: ఇటీవల కాలంలో బస్సులు, రైళ్లలో చిన్న చిన్న గొడవలు, తగాదాలు రొటీన్‌గా మారాయి. సీట్ల కోసం తగువులు, మాటల యుద్ధం, కాస్త ఎక్కువైతే ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఇవన్నీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో జరిగే సాధారణ విషయాలుగా భావించే వారు, ఇప్పుడు ఆ కల్చర్ విమానాల్లోకి చేరుకుందని షాక్ అవుతున్నారు.

Viral Video: సోషల్ మీడియా విస్తృతమయ్యాక ఎక్కడ జరిగినా చిన్న సంఘటన పెద్ద చర్చగా మారుతోంది. తాజాగా విమానంలో జరిగిన ఒక కొట్లాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్ ఇండియా రన్నింగ్ ఫ్లైట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇది కూడా చదవండి: 6G Network: 6జీ వచ్చేస్తుందోచ్.. ఆకాశమే హద్దుగా సిగ్నల్స్.. IIT హైదరాబాద్ ఘనత..!

వివరాల్లోకి వెళ్తే—కోల్డ్ టీ కోసం ఇద్దరు ప్రయాణికుల మధ్య చిన్న వివాదం మొదలైంది. మొదట మాటల యుద్ధంతో మొదలైన గొడవ, కొద్ది సేపటికే తీవ్ర స్థాయికి చేరింది. ఒక మహిళ తోటి ప్రయాణికుడిపై ఆగ్రహంతో పడి ముష్టి ఘాతాలు కురిపించింది. అక్కడితో ఆగకపోగా పీకలు పట్టుకుని బలంగా దాడి చేసింది. తోటి వ్యక్తి కూడా వెనకాడకుండా ప్రతిదాడి చేశాడు. దీంతో ఇద్దరూ విమానంలో ఘోరంగా కొట్టుకున్నారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న ఎయిర్ హోస్టెస్‌లు ఇద్దరినీ విడదీయడానికి ప్రయత్నించినా, “మేము తగ్గేదేలే” అన్నట్లు గొడవ ఆగలేదు. ఈ దృశ్యాలను చూసిన తోటి ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. విమానంలో జరుగుతున్న ఈ కొట్లాటను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాసేపట్లోనే వైరల్ అయ్యింది.

ప్రొఫెషనల్ ప్రయాణికులే ఎక్కువగా ఎయిర్ ట్రావెల్ చేస్తారని అందరికీ తెలుసు. అలాంటి చోట గల్లీ స్థాయి గొడవలు జరగడం కొందరిని నవ్వు తెప్పిస్తుండగా, మరికొందరిని ఆందోళనకు గురి చేస్తోంది. నెటిజన్లు కూడా ఈ ఘటనపై విభిన్నంగా స్పందిస్తున్నారు. “రోజురోజుకీ మనుషులు ఇలా మారిపోతున్నారు ఎందుకు?”, “ఓ భయ్యా.. దూరంగా ఉండి ఉంటే బాగుండేది, లేకపోతే విమానం నుంచే తోసేస్తుంది” అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ సంఘటనతో మరోసారి ప్రశ్న లేవనెత్తబడింది—పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో చిన్న విషయాలకే ఇలా పెద్ద గొడవలు చేయడం, మరీ విమానాల్లో కూడా తగాదాలు చేసుకోవడం సమాజం ఎటు వెళ్తోందనే సందేహం కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *