Royal Enfield: భారీగా తగ్గనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ధరలు – కొత్త జాబితా ఇదే!

Royal Enfield: ఆటో న్యూస్: భారత ప్రభుత్వం GST 2.0లో భాగంగా వస్తువులు, సేవల పన్ను (GST) రేట్లను తగ్గించి, సెస్‌ను తొలగించడం వల్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 350cc మోటార్‌సైకిళ్ల ధరలను రూ.22,000 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇప్పటికే కొత్త ధరల జాబితాను విడుదల చేసింది.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ 350cc శ్రేణి బైకులు ఇప్పుడు మరింత చవకగా లభించనున్నాయి. సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి వచ్చే ఈ కొత్త ధరలు హంటర్ 350 బేస్ రెట్రో ట్రిమ్ కోసం రూ.1.38 లక్షల నుండి ప్రారంభమవుతాయి. అత్యంత ఖరీదైన గోవా క్లాసిక్ వేరియంట్ ధర రూ.2.20 లక్షలు (ఎక్స్-షోరూమ్).

తగ్గిన ధరలు:

  • Hunter 350 → రూ.12,000 – రూ.15,000 తగ్గింపు

  • Bullet 350 → రూ.15,000 – రూ.18,000 తగ్గింపు

  • Classic 350 → రూ.16,000 – రూ.19,000 తగ్గింపు

  • Meteor 350 → రూ.17,000 – రూ.19,000 తగ్గింపు

గతంలో ద్విచక్ర వాహనాలపై 31% పన్ను (28% GST + 3% సెస్) ఉండేది. కొత్త సవరణల ప్రకారం, 350cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గల వాహనాలపై 18% ఏకరీతి GST మాత్రమే ఉంటుంది.

350cc బైకుల ధరలు తగ్గినా, 440cc ఇంకా 650cc శ్రేణి బైకుల ధరలు పెరిగాయి. వీటిలో స్క్రామ్ 440, హిమాలయన్ 450, గెరిల్లా 450, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650, షాట్‌గన్ 650, బేర్ 650, సూపర్ మీటియర్ 650 వంటి మోడల్స్ ఉన్నాయి. వీటిపై ఇప్పుడు 40% GST విధించనున్నారు.

పెరిగిన ధరలు:

  • Scram 440 → రూ.15,131 – రూ.15,641 పెరిగింది

  • Guerrilla 450 → రూ.17,387 – రూ.18,479 పెరిగింది

  • Himalayan 450 → రూ.20,733 – రూ.21,682 పెరిగింది

  • Interceptor 650 → రూ.22,512 – రూ.24,604 పెరిగింది

  • Continental GT 650 → రూ.23,712 – రూ.25,645 పెరిగింది

  • Classic 650 → రూ.24,633 – రూ.25,607 పెరిగింది

  • Shotgun 650 → రూ.26,874 – రూ.27,889 పెరిగింది

  • Bear 650 → రూ.25,545 – రూ.26,841 పెరిగింది

  • Super Meteor 650 → రూ.27,208 – రూ.29,486 పెరిగింది

350cc శ్రేణి బైకులు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా మారగా, పెద్ద ఇంజిన్ బైక్ అభిమానులకు మాత్రం అదనపు భారం తప్పదనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *