Shriya Saran: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలతో పాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా పెద్ది సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఈ ముగ్గురు మెగా హీరోలతోనూ స్క్రీన్‌పై కనిపించిన ఒక హీరోయిన్ ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.
Shriya Saran: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు తమ వయసుకు మించిన పాత్రలు చేస్తూ, కొత్త ఇమేజ్ను సంపాదిస్తారు. ఒకే హీరోకు భార్య, అక్క, తల్లి వంటి విభిన్న పాత్రల్లో కనిపించడం ఆశ్చర్యం కాదు. అయితే ఒక హీరోయిన్ మెగా కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలతోనూ వేర్వేరు రోల్స్ చేసి ప్రత్యేకత సాధించింది.
ఇది కూడా చదవండి: Viral Video: పెట్రోల్ బంక్ వాటర్ కూలర్లో బల్లి ఈత.. కలుషిత నీరు చూసి షాక్ అయిన వ్యక్తి!
గ్రీన్ బ్యూటీ శ్రియా శరణ్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో లవర్‌గా కనిపించింది. తరువాత పవన్ కళ్యాణ్ బాలు సినిమాలో ఆయన ప్రేమికురాలిగా మెరిసింది. ఆమె అందానికి అప్పట్లో ఫిదా కాని ప్రేక్షకుడు లేడనే చెప్పాలి.
మెగాస్టార్, పవన్ కళ్యాణ్ లవర్‌గా నటించిన శ్రియా, రామ్ చరణ్‌కు మాత్రం తల్లిగా కనిపించింది. అదే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో. రామ్ చరణ్ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో చిన్న పాత్రలోనే కనిపించినా, తల్లిగా శ్రియా భావోద్వేగ నటనతో ఆకట్టుకుంది.
శ్రియా ఇటీవలే మిరాయ్ సినిమా ద్వారా భారీ హిట్ అందుకుంది. యంగ్ హీరోయిన్స్‌ను టఫ్ కాంపిటేషన్ ఇస్తూ, ఇప్పటికీ తన అందం, గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. చిరంజీవి, పవన్ లవర్‌గా.. చరణ్ తల్లిగా నటించిన ఈ ప్రత్యేకత శ్రియాకే దక్కింది.
View this post on Instagram
