Cardless Withdraw: ఏటియం కార్డు లేకపోయినా క్యాష్ విత్‌డ్రా.. ఫోన్‌తోనే డబ్బు తీసుకునే సదుపాయం!

Cardless Withdraw: భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నప్పటికీ, క్యాష్ అవసరమైనప్పుడు ఇప్పటికీ ఏటియం కార్డు తప్పనిసరి అవుతుంది. అయితే ఈ పరిస్థితిని మార్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ప్రయోగం ప్రారంభించబోతోంది. ఇకపై ఫోన్ ద్వారా యూపీఐ (UPI) స్కాన్ చేసి నేరుగా క్యాష్ విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.

Cardless Withdraw: ఈ కోసం దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా బిజినెస్ కరస్పాండెంట్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేయాలని NPCI ప్రణాళిక సిద్ధం చేసింది. బ్యాంకులు లేదా ఏటీఎంలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఇవి మరింత ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది పెద్ద ఉపశమనం కానుంది.

ఇది కూడా చదవండి: Viral Video: పెట్రోల్ బంక్ వాటర్ కూలర్‌లో బల్లి ఈత.. కలుషిత నీరు చూసి షాక్ అయిన వ్యక్తి!

ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే యూపీఐ ఆధారిత ఏటీఎంలు ఉన్నప్పటికీ, అవి పరిమితంగా ఉన్నాయి. అందుకే ప్రత్యేకంగా వ్యాపారులు, షాపు ఓనర్లను బిజినెస్ కరస్పాండెంట్ అవుట్‌లెట్‌లుగా అనుమతించనున్నారు. వారికి పాయింట్-ఆఫ్-సేల్ మెషిన్‌తో పాటు ఒక QR కోడ్ కూడా ఇస్తారు.

కస్టమర్లు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ ద్వారా ఆ కోడ్ స్కాన్ చేసి, గరిష్టంగా రూ.10,000 వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *