Kerala Woman: వీడురా కొడుకంటే.తల్లిన కలను నెరవేర్చాడు..!

Kerala Woman: వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని మరోసారి నిరూపితమైంది. కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన 71 ఏళ్ల లీలా జోస్, తన చిన్నప్పటి కలను నెరవేర్చుకున్నారు. 13,000 అడుగుల ఎత్తులో స్కైడైవింగ్ చేసి, అతి పెద్ద వయసులో ఈ సాహసానికి పాల్పడిన మహిళగా రికార్డు సృష్టించారు.

Kerala Woman: చిన్నతనం నుంచే విమానాలను చూస్తూ ఎప్పుడో ఒకరోజు ఆకాశంలో ఎగరాలని కలగన్న లీలా జోస్, తన కోరికను చుట్టుపక్కల వారికి చెప్పినప్పుడు వారు ఆమెను ఎగతాళి చేశారు. “వృద్ధురాలు కావడంతో సాధ్యం కాదని” అంటూనే ఉన్నా, ఆమె తన కలను సజీవంగా ఉంచుకుంది.

ఇది కూడా చదవండి: Bharat-UAE: సౌదీ-పాక్ రక్షణ ఒప్పందం కలకలం.. భారత్-యుఎఇ కుదుర్చుకున్న కీలక ఒప్పందం..!

లీలా జోస్ గత నెలలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన కొడుకు అనిష్‌ను కలవడానికి దుబాయ్ వెళ్లారు. తన తల్లి నిజంగానే స్కైడైవింగ్ చేయాలని కోరుకుంటుందని గ్రహించిన అనిష్, వెంటనే దుబాయ్ స్కైడైవింగ్ బృందంతో టాండమ్ జంప్ బుక్ చేశారు. మొదట వయసు చూసి బృందం ఆశ్చర్యపోయినా, ఆమె పట్టుదల చూసి సపోర్ట్ ఇచ్చారు.

ఈ జంప్‌తో పాటు వీడియోలు, ఫోటోలు తీసేందుకు అనిష్ దాదాపు ₹2 లక్షల వరకు ఖర్చు చేశాడు. తన తల్లి ఆనందం కోసం మరపురాని బహుమతిని అందించాడని అనిష్ చెప్పాడు. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరిన ఆ అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుందని లీలా జోస్ ఆనందంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *