Cow Operation: తెలంగాణలో షాకింగ్ ఘటన: ఆవు కడుపులో 90 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు..!

Cow Operation: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో ఒక విచిత్ర సంఘటన వెలుగుచూసింది. కడుపు ఉబ్బిపోవడం, నొప్పితో బాధపడుతున్న ఓ ఆవును పశువైద్యశాలకు తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షలు చేసి ఆవు కడుపులో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని గుర్తించారు. అనంతరం అత్యవసరంగా ఆపరేషన్ చేసి కడుపులోని వ్యర్థాలను బయటకు తీశారు.

Cow Operation: రామలింగం అనే రైతు తన పాడి ఆవుతో జీవనం సాగిస్తున్నాడు. అతని దగ్గర ఉన్న 9 ఏళ్ల ఆవు కొద్ది రోజులుగా నీరసంగా, అనారోగ్యంగా ఉంది. ఆవు కడుపు భారీగా వాపు రావడంతో ఆందోళన చెందిన రైతు, తన ఆవును స్థానిక పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడ పశువైద్యాధికారి పి. పెంటయ్య ఆవును పరిశీలించి, కడుపులో జీర్ణం కాని ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయని గుర్తించారు.

ఇది కూడా చదవండి: Wife-Husband: నిద్రలో ఉన్న భర్తను కత్తితో గొంతు కోసిన భార్య!

“ఆపరేషన్ చేయకపోతే ఆవు ప్రాణాలు ప్రమాదంలో పడతాయి” అని డాక్టర్ హెచ్చరించారు. రైతు భయపడినా, వైద్యులు ధైర్యం చెప్పి సిబ్బందితో కలిసి నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేశారు.

ఆపరేషన్ పూర్తయ్యాక బయటపడ్డ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆవు కడుపులో నుంచి 90 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. అందులో ప్లాస్టిక్ కవర్లు, వైర్లు, తాళ్లు, తీగలు, కేబుల్ వైర్లు, మామిడి టెంకలు, ఇనుప తీగలు, జాలీలు, గుడ్డ ముక్కలు ఇలా అనేక రకాల వస్తువులు ఉన్నాయి.

వైద్యులు చెబుతున్నట్లుగా, పట్టణ ప్రాంతాల్లో గడ్డి, పచ్చి మేత లభించకపోవడంతో ఆవులు రోడ్లపై తిరుగుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను తింటాయి. అవి జీర్ణం కాక ఏళ్ల తరబడి కడుపులో చేరిపోతాయి.

పశువైద్యాధికారి పెంటయ్య మాట్లాడుతూ, “జంతు ప్రేమికులు, స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తే, రోడ్లపై తిరిగే ఆవుల కడుపులోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఆపరేషన్ ద్వారా తొలగించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *