Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. చౌకగా లభించే నీళ్ల బాటిల్!

Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో విక్రయించే రైల్ నీర్ వాటర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో పాటు, రైల్వే మంత్రిత్వ శాఖ ధరలను సవరించింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానున్నాయి.

Indian Railways: ఇప్పటివరకు ఒక లీటర్ రైల్ నీర్ బాటిల్ ధర రూ.15గా ఉండగా, ఇకపై అది రూ.14కే లభించనుంది. అంతేకాకుండా, 500 ఎంఎల్ హాఫ్ లీటర్ బాటిల్ ధర రూ.10 నుంచి రూ.9కి తగ్గింది. అంటే ప్రయాణికులకు నేరుగా రూ.1 వరకు ఆదా అవుతుంది.

ఇది కూడా చదవండి: Hyderabad Cybercrime: సైబర్‌క్రైమ్‌ పోలీసుల సంచలన ఆపరేషన్‌.. 14 రాష్ట్రాల్లో నిందితులు అరెస్ట్!

కేవలం రైల్ నీర్ మాత్రమే కాకుండా, IRCTC మరియు రైల్వేలు షార్ట్‌లిస్ట్ చేసిన ఇతర బ్రాండ్‌ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ధరలు కూడా తగ్గించబడ్డాయి. ఇకపై రైల్వే ప్రాంగణాల్లో, రైళ్లలో లభించే నీళ్ల బాటిళ్ల ధరలు ఇలా ఉంటాయి:

  • 1 లీటర్ బాటిల్: రూ.14 
  • 500 ఎంఎల్ బాటిల్: రూ.9 

జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన ప్రయోజనాన్ని నేరుగా ప్రయాణికులకు అందించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రైల్లో ప్రయాణించే వారికి ఇప్పుడు తక్కువ ధరకే నీళ్ల బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *