leh protests: లేహ్ అల్లర్ల వెనుక పాకిస్తాన్? వాంగ్ చుక్ ప్లాన్ అదేనా ?

leh protests: లడఖ్ రాష్ట్ర హోదా కోసం పోరాడినందుకు అరెస్టయిన కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు, పాకిస్తాన్ గూఢచారికి మధ్య ఉన్న అనుమానిత సంబంధాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో భాగంగా ఉన్న లడఖ్ ఇప్పుడు అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది.  ఈ నేపథ్యంలో, విద్యావేత్త , సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ 10వ తేదీన నిరాహార దీక్ష ప్రారంభించారు. దీనిలో భాగంగా 24న జరిగిన సంపూర్ణ బంద్ నిరసన హింసతో ముగిసింది. 

leh protests: ఆరోజున లేహ్‌లో, నిరసనకారులు కవాతు చేసి ప్రభుత్వ కార్యాలయాలు మరియు బిజెపి కార్యాలయానికి నిప్పు పెట్టారు. దుకాణాలు, వాహనాలు తగలబెట్టడం జరిగింది. ఈ సంఘటనలో ఐదుగురు మరణించారు100 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు కొద్దిగా ముందుగా నిరాహారదీక్ష చేస్తున్న వాంగ్ చుక్ శిబిరంలో ఆయన సహచరులను ఇద్దరినీ పోలీసులు ఆరోగ్యకరణాలతో దీక్షను బలవంతంగా విరమింపచేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన జెన్ జెడ్ తరహా ఉద్యమం చేయాలంటూ అక్కడ ఉన్న యువతకు పిలుపునిచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయారని ఆరోపణలు వచ్చాయి. తరువాత వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను ముగించారు.

లడఖ్ హింసకు వాంగ్‌చుక్ ప్రసంగమే కారణమని ఆరోపిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆయన కంపెనీ విదేశీ నిధుల ఆమోదాన్ని రద్దు చేసింది. 

leh protests: దీనితరువాత, జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. వాంగ్‌చుక్‌ను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఉంచారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన్ని అక్కడికి తీసుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు.

వాంగ్‌చుక్‌ను లడఖ్ పోలీసులు, కేంద్ర నిఘా సంస్థ విచారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వాంగ్‌చుక్‌కు మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌కు చెందిన గూఢచారితో ఉన్న సంబంధాలపై దర్యాప్తు ప్రారంభించారు. 

leh protests: దీనికి సంబంధించి, లడఖ్ డిజిపి సింగ్ జామ్వాల్ మాట్లాడుతూ లేహ్ లో జరిగిన హింస వెనుక వాంగ్ చుక్ హస్తం ఉందని నిర్ధారణ అయినట్టు చెప్పారు.  లడఖ్ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఆయన తన నిరాహార దీక్షను విరమించలేదు. అదేవిధంగా ఫిబ్రవరిలో ఆయన పాకిస్తాన్ ను సందర్శించి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, కొద్దిరోజుల క్రితం 

వాంగ్‌చుక్ బంగ్లాదేశ్‌కు కూడా ప్రయాణించారు. ఈ పర్యటన, దానివెనుక ఉన్న ఆయన  ఎజెండా గురించి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.  ఇటీవల, మేము పాకిస్తాన్ నుండి ఒక నిఘా అధికారిని అరెస్టు చేసాము. వాంగ్‌చుక్ అతనితో సంప్రదింపులు జరిపాడు. ఈ విషయంలో వివిధ ప్రశ్నలు తలెత్తినందున మేము దర్యాప్తు చేస్తున్నాము అని లడఖ్ డిజిపి వెల్లడించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *