Rapido: రాపిడో ప్రకటనలపై సీసీపీఏ కఠినం.. వినియోగదారులకే గుడ్ న్యూస్!

Rapido: ఆన్‌లైన్ బైక్–టాక్సీ సర్వీసు రాపిడోకు భారీ షాక్ తగిలింది. వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలతో వ్యవహరించిందని నిర్ధారించిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కంపెనీపై రూ.10 లక్షల జరిమానా విధించింది.

Rapido: రాపిడో తన ప్రకటనలలో “5 నిమిషాల్లో ఆటో లేదా రూ.50 గ్యారంటీ” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఈ హామీ వాస్తవానికి అమలు కాలేదని, వినియోగదారులకు ఇవ్వబోయే డబ్బు నిజమైన కరెన్సీ కాకుండా కేవలం రాపిడో నాణేలు మాత్రమే అని విచారణలో తేలింది. ఇవి కూడా ఏడు రోజుల్లో గడువు ముగిసేలా ఉండడంతో, వినియోగదారుల అసలు ప్రయోజనానికి పనికిరాలేదని అధికారులు వెల్లడించారు.

గత 14 నెలలలో 1,200కిపైగా ఫిర్యాదులు రాపిడోపై నమోదయ్యాయని నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ డేటా చూపించింది. ముఖ్యంగా – సేవలో లోపాలు, రిఫండ్ ఇవ్వకపోవడం, అధిక ఛార్జీలు, వాగ్దానం చేసిన సౌకర్యాలు అందించకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉన్నట్లు తేలింది.

ప్రకటనలలో చూపిన డిస్‌క్లెయిమర్లు చిన్న అక్షరాలతో, చదవడానికి కష్టంగా ఉండేలా రాసి ఉండటం కూడా తప్పుదారి పట్టించడమేనని CCPA పేర్కొంది. ఈ కారణంగా రాపిడోపై జరిమానా విధిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి మోసపూరిత ప్రకటనలకు పాల్పడకూడదని హెచ్చరిక జారీ చేసింది.

వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఉపశమనం కలిగించింది. ఇకపై ఇలాంటి తప్పుడు ప్రకటనలను నమ్మే ముందు తప్పనిసరిగా నిబంధనలు, షరతులు పరిశీలించుకోవాలని సీసీపీఏ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *