Karur Stampede: కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన విజయ్!

Karur Stampede: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని, దేశాన్ని కుదిపేసింది. TVK అధినేత, నటుడు విజయ్ సభలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ఉన్నారు. ఇంకా 95 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Karur Stampede: ఈ ఘటనపై స్పందించిన విజయ్, తన గుండె ముక్కలైందని, బాధను మాటల్లో చెప్పలేనని ట్వీట్ చేశారు. “మీ ముఖాలు నా మదిలో మెదులుతున్నాయి. నాపై చూపిన అభిమానాన్ని ఆలోచిస్తే నా హృదయం భారంగా మారుతోంది” అని పేర్కొన్నారు.

పరిహారం ప్రకటించిన TVK విజయ్, బాధితుల కోసం విజయ్ పరిహారం ప్యాకేజ్ను ప్రకటించారు: మరణించిన వారి కుటుంబాలకు ₹20 లక్షలు, గాయపడిన వారికి ₹2 లక్షలు. “ఈ డబ్బు ముందు నష్టం పెద్దది. కానీ, మీలో ఒక కుటుంబ సభ్యుడిగా సహాయం చేయడం నా బాధ్యత” అని విజయ్ పేర్కొన్నారు.

ప్రభుత్వాలు, ప్రధాని పరిహారం: ప్రధాని మోదీ – మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50,000 (PMNRF ద్వారా). తమిళనాడు ప్రభుత్వం – మృతుల కుటుంబాలకు ₹10 లక్షలు, గాయపడిన వారికి ₹1 లక్ష. సీఎం స్టాలిన్ స్వయంగా కరూర్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

తొక్కిసలాట ఘటనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి, TVK పార్టీకి చెందిన ముగ్గురు నేతలను FIRలో చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌తో దర్యాప్తు ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ కూడా నివేదిక కోరింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని తమిళనాడు BJP డిమాండ్ చేసింది.

ఈ ఘటన కరూర్‌లో 39 కుటుంబాలను శాశ్వతంగా దుఃఖంలో ముంచేసింది. అభిమానుల ప్రాణాలు కోల్పోవడం, రాజకీయ మీటింగ్ విషాదకర మలుపు తీయడం రాష్ట్రాన్ని కుదిపేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *