Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనక దుర్గమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు (సెప్టెంబర్ 29) మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
Indrakeeladri: సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచే లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లు పొడవుగా ఉండగా, ఆలయ పరిసరాల్లో పోలీస్ బందోబస్తు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Haryana: రెండో తరగతి విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీసిన టీచర్!
సరస్వతీ అలంకారంలో ఉన్న అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు సీఎం కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.
సరస్వతి దేవి వేదకాలం నుంచే జ్ఞానానికి ప్రతీకగా పూజింపబడుతోంది. ప్రణవనాదం ‘ఓంకారం’ నుంచే సర్వ విద్యలు ఉద్భవించాయని శాస్త్రాలు చెబుతున్నాయి. హంస వాహనముగా, వీణా ధరిణిగా, తెల్లని వర్ణంతో సరస్వతి జ్ఞానం, వివేకం, పరిశుద్ధతకు ప్రతీకగా భావించబడుతోంది.
‘సరస్’ అంటే ప్రవాహం, చలనం అని అర్థం. అందుకే సృష్టిలో జ్ఞాన ప్రవాహాన్ని ప్రతిబింబించే చైతన్య శక్తిగా సరస్వతి దేవి స్తుతించబడింది.
