Alekhya Reddy: నందమూరి కుటుంబానికి చెందిన నటుడు తారకరత్న ఆకస్మిక మరణం సినీ, రాజకీయ రంగాలను కుదిపేసింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న, గుండెపోటుకు గురయ్యాడు. కుప్పం ఆసుపత్రి నుంచి బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా, సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, 2023 ఫిబ్రవరి 18న శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచాడు.
Alekhya Reddy: ‘ఒకటో నంబర్ కుర్రాడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారకరత్న, అనేక చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించారు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా, విలన్ పాత్రల్లోనూ తన నటన ప్రతిభను చూపించారు. ముఖ్యంగా ‘అమరావతి’ చిత్రంలో ఆయన పోషించిన ప్రతినాయక పాత్రకు నంది అవార్డు లభించడం విశేషం. తాత ఎన్టీఆర్లా రాజకీయాల్లోనూ రాణించాలని కలలు కన్న తారకరత్న, అకాల మరణంతో ఆ కలలన్నీ చెదిరిపోయాయి.
తారకరత్న మరణం నందమూరి కుటుంబానికి, అభిమానులకు పెద్ద దెబ్బగా మారింది. అయితే, అతని భార్య అలేఖ్యా రెడ్డి ఇప్పటికీ ఆ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తన ముగ్గురు పిల్లలతో కలిసి మహాలయ అమావాస్య సందర్భంగా భర్తకు నివాళులర్పించిన ఆమె, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ పోస్ట్లో అలేఖ్యా రెడ్డి ఎమోషనల్గా రాసిన మాటలు హృదయాలను కదిలిస్తున్నాయి: “నా మనసులో భరించలేని బాధ ఉంది. నీ కళ్లు శాశ్వతంగా మూసుకున్న తర్వాతే నీ కోరిక నెరవేరింది. అదే క్షణంలో మిగతావన్నీ నీతో పాటే వెళ్లిపోయాయి. కాలం గడిచే కొద్దీ నిన్ను మరింతగా మిస్ అవుతున్నా. అయినప్పటికీ నేను ఆశను వదులుకోను.. ఎందుకంటే నీ గుండె చప్పుడు ఇప్పటికీ నాలో బతికే ఉంది” అంటూ తన భర్తపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నందమూరి అభిమానులు అలేఖ్యా రెడ్డికి ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
