Viral Video: అడవిలో జంతువుల మధ్య జరిగే పోరాటాలు ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటాయి. అలాంటి ఒక భీకరమైన పోరాటం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకే గదిలో ఎదురెదురైన పాము-ముంగీసలు చివరి వరకు ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ కలిగించేలా పోరాడాయి.
Viral Video: వైరల్ వీడియోలో, నల్లటి రంగులో కనిపించే కింగ్ కోబ్రా తన పడగ విప్పి బుసకొడుతుండగా, ఎదురుగా నిలిచిన ముంగీస ఒక్కసారిగా దూకి పాము పడగను పట్టుకుంది. పాము కూడా వదిలేయకుండా ముంగీస శరీరం చుట్టూ తన పట్టు బిగించింది. ఇరుకైన ప్రదేశంలో సాగిన ఈ 32 సెకన్ల పోరాటం ఊపిరి బిగపట్టేలా చేసింది. చివరికి పాము తనను తాను విడిపించుకున్నా, ముంగీస మాత్రం పట్టు వదలకుండా దాడి చేస్తూనే ఉంది.
ఇది కూడా చదవండి: Funny Video: మనిషి కోతి నుండి వచ్చాడంటే ఏమో అనుకున్న కానీ ఈ వీడియో చుస్తే నిజమే అనిపిస్తుంది!
ఈ వీడియోను సోషల్ మీడియా X (@cute_girl789) అనే యూజర్ షేర్ చేశారు. “ఇంతకు ముందు ఎప్పుడూ ముంగీసే గెలుస్తుందని విన్నాం.. ఇప్పుడు ఈ వీడియోలో కూడా అదే స్పష్టంగా కనిపిస్తోంది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పటికే 48,000 సార్లు వీక్షించబడింది. వందలాది మంది లైకులు ఇచ్చి, విభిన్న రకాల కామెంట్లు చేస్తున్నారు.
నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ –“ఇది నిజంగా ఉత్కంఠ భరిత పోరాటం.. ముంగీస గెలుస్తుందనేది మళ్లీ నిరూపితమైంది” అని ఒకరు రాశారు. “నేను చిన్నప్పుడు పాము-ముంగీస పోరాటం చూసేవాడిని.. కానీ ఇప్పుడు ఇవి చాలా అరుదుగా కనిపిస్తున్నాయి” అంటూ మరోకరు కామెంట్ చేశారు.
మొత్తానికి, ప్రకృతి యుద్ధం అంటే ఎలా ఉంటుందో చూపించిన ఈ పాము-ముంగీసల పోరాటం వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
पहले तो हमने केवल सुना ही था कि सांप और नेवले की लड़ाई में हमेशा नेवला ही जीतता है और आज आप वीडियो से भी देख लो नेवला ही जीतता है
इनके बारे में आपके क्या विचार है pic.twitter.com/now5ZgXgD0— Sonalika (@cute_girl789) September 30, 2025
