Viral News: పిల్లల కోసం బిస్కెట్లు, బెలూన్లు కొన్నారు.. వాటిపై రాసినది చూసి షాక్!

Viral News: రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఒక ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లల కోసం కొన్న బిస్కెట్ ప్యాకెట్లలో, బెలూన్లలో పాకిస్తాన్ జెండాలు ఇంకా వాటిపై “14 ఆగస్టు స్వాతంత్ర్య వేడుక” అని రాసి ఉండటం స్థానికులను షాక్‌కి గురిచేసింది.

Viral News: వివరాల్లోకి వెళ్తే, ప్రహ్లాద్ రాథోడ్ అనే వ్యక్తి తన పిల్లలకు బిస్కెట్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లారు. పిల్లలు బెలూన్లను గాలితో ఊదగానే, అందులో పాకిస్తాన్ జెండా మరియు “14 ఆగస్టు స్వాతంత్ర్య వేడుక” అని వ్రాసిన బెలూన్ కనిపించింది. ఈ దృశ్యం చూసి కుటుంబ సభ్యులు ఇంకా పొరుగువారు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఇది కూడా చదవండి: IBomma: ఐబొమ్మ పోలీసులకు సవాల్ ‘చేతనైతే పట్టుకోండి.. తగ్గేదేలే!’ అంటూ పోస్ట్!

స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హిందూ సంస్థలు కూడా పిల్లల అమాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న దేశ వ్యతిరేక కుట్ర అని విమర్శిస్తూ, ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కిరాణా దుకాణం నుంచి అనుమానాస్పద వస్తువులను స్వాధీనం తీసుకొని స్టేషన్‌లో భద్రంగా ఉంచారు. దుకాణదారుడు వెల్లడించినట్లుగా, ఈ వస్తువులు మధ్యప్రదేశ్‌లోని అలోట్ నుంచి డెలివరీ అయ్యాయి. పోలీసులు సరఫరా నెట్‌వర్క్‌ను పరిశీలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా లోని తయారీ కంపెనీ చిరునామా కూడా ప్యాకెట్లపై కనిపించింది.

ప్రస్తుతం నిందితుడైన సరఫరాదారుని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పూర్తి దర్యాప్తు పూర్తయ్యాక ఈ సంఘటనలోని వివరాలను ప్రజలకు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టపరిచారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *