Tollywood Heroine: 12 సినిమాలు చేసినా 10 ప్లాప్స్..సోషల్ మీడియా స్టార్ కి తగ్గని క్రేజ్

Tollywood Heroine: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సక్సెస్ అవ్వడం అంత సులభం కాదు. అందం, అభినయం ఉన్నా అదృష్టం కలవకపోతే కెరీర్ సాగడం కష్టమవుతుంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ముద్దుగుమ్మల్లో యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల ఒకరు.

Tollywood Heroine: కెరీర్ ప్రారంభంలోనే వరుసగా మంచి అవకాశాలు దక్కించుకున్నా, ఆ సినిమాలు ఎక్కువగా ఫ్లాప్స్ కావడంతో ఆమెకు స్టార్‌డమ్ దూరమైంది. అయితే హిట్స్–ఫ్లాప్స్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నా, ఆ తర్వాత సరైన విజయాలు అందుకోలేకపోయింది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య, హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసింది. తరువాత ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసింది. కానీ నటన పట్ల ఉన్న ప్యాషన్ వదలకుండా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ఆమె చేసిన షాదీ షార్ట్ ఫిల్మ్‌కి ఉత్తమ నటిగా సైమా అవార్డు కూడా గెలుచుకుంది.

ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య, మల్లేశం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్లో నటించి క్రేజ్ సంపాదించింది. మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి, పొట్టేల్, తంత్ర వంటి సినిమాల్లో నటించినా, బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది.

ఇప్పటివరకు 12 సినిమాల్లో నటించిన అనన్య, కేవలం 2 సినిమాలతోనే హిట్ అందుకుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించి, స్టార్ స్టేటస్‌కి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. కష్టపడుతూ, ప్రతి అవకాశాన్ని తన టాలెంట్ చూపించడానికి ఉపయోగించుకుంటూ, త్వరలోనే సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *