Crime News: గతంలో 14 ఏళ్లు జైలు శిక్ష.. ఇపుడు రూ.200 కోసం మళ్లీ జైలుకెళ్లాడు!

Crime News: కర్ణాటకలో చోటుచేసుకున్న ఓ షాకింగ్ ఘటన అందరినీ కలచివేస్తోంది. గతంలోనే తన మేనమామను హత్య చేసి 14 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి, తాజాగా మళ్లీ హత్య కేసులో అరెస్టు అయ్యాడు. చిన్న కారణం కోసం ప్రాణాలు తీయడమే కాకుండా, గతంలో జైల్లో గడిపిన శిక్ష అతడిని మార్చలేకపోయిందనడం మరో విషాదం.

Crime News: ఉత్తర కర్ణాటకలోని కమటగేరికి చెందిన మంజునాథ్ బజయ్య చెన్నయ్య, 2002లో తన మేనమామను హత్య చేసి 14 ఏళ్ల యావజ్జీవ శిక్ష అనుభవించాడు. 2016లో జైలు నుంచి విడుదలైన తర్వాత అతడు దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రవీశ్ గణపతి చెన్నయ్య (35) తో మంజునాథ్‌కు స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ తరచూ కలిసి కూలీ పనులకు వెళ్లేవారు.

గురువారం రాత్రి (ఆగస్ట్ 14) మద్యం సేవించిన వీరిద్దరూ కూలీ డబ్బుల విషయంలో వాగ్వాదానికి దిగారు. రవీశ్ ఇవ్వాల్సిన రూ.500లో కేవలం రూ.300 మాత్రమే ఇచ్చాడు. మిగిలిన రూ.200 ఇవ్వలేదనే కారణంతో మంజునాథ్ ఆగ్రహానికి గురై, ఇంటి వద్ద ఉన్న కొడవలితో రవీశ్ తలపై దారుణంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రవీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

తరువాత రవీశ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, సిరి రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి మంజునాథ్‌ను అరెస్టు చేశారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కేవలం రూ.200 కోసం మరోసారి జైలుకెళ్లిన మంజునాథ్‌ పై అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *