Crime News: ఒంటరి మహిళలే టార్గెట్.. ఈ భార్యాభర్తల యవ్వారం తెలిస్తే కళ్లు తేలేస్తారు..!

Crime News: భోపాల్‌లో సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి, వారి వ్యక్తిగత క్షణాలను వీడియో తీయించి బ్లాక్‌మెయిల్ చేసిన దంపతులను పోలీసులు పట్టుకున్నారు. ఈ జంట మోసపూరితంగా రూ.85 లక్షల వరకు వసూలు చేసినట్లు తేలింది.

Crime News: నిందితుడు అవినాష్ ప్రజాపతి, తనను విడాకులు తీసుకున్న వ్యక్తిగా మ్యాట్రిమోనియల్ సైట్‌లో ప్రొఫైల్ సృష్టించాడు. తనను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుంటూ ఒంటరి మహిళలను టార్గెట్ చేశాడు. మొదటగా, అవధ్‌పురికి చెందిన ఒక మహిళను ట్రాప్ చేశాడు. ఆమెను తన ఇంటికి పిలిచి భార్యను ‘తల్లి’గా పరిచయం చేశాడు. గదిలోకి తీసుకెళ్లి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇదంతా అతని భార్య రహస్యంగా కెమెరాలో బంధించింది.

Crime News: తరువాత వ్యాపార విస్తరణ పేరుతో ఆ మహిళను బెదిరించి రూ.40 లక్షల నగదు, రూ.5 లక్షల విలువైన ఆభరణాలను తీసుకున్నాడు. పెళ్లి మాట తప్పిన తర్వాత ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇదే తరహాలో, అశోకా గార్డెన్ ప్రాంతానికి చెందిన మరో బ్యూటీషియన్‌ను కూడా మోసగించాడు. ఆమె దగ్గర నుంచీ కూడా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడు.

ఇది కూడా చదవండి: Crime News: గొర్రెలు కొట్టేద్దామని పోయి.. ఏం చేశారో తెలుసా!

చివరికి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు యవ్వారం బహిర్గతమైంది. బాగ్సేవానియా పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి అవినాష్‌ను అరెస్టు చేశారు. విచారణలో అతను మరికొందరు మహిళలను కూడా ఇదే రీతిలో మోసగించినట్లు బయటపడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం నిందితుడు కోర్టులో హాజరుకాగా, అతని భార్యపై కూడా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఈ సంఘటన ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకునే మోసగాళ్లపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *