Pawan Kalyan: ‘ఓజీ’ సంచలనం అమెరికాలో రికార్డులు బద్దలు కొడుతున్న పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఇంకా ట్రైలర్ కూడా రాకముందే, ఈ సినిమా ఉత్తర అమెరికాలో ప్రీమియర్ ప్రీ-సేల్స్ ద్వారా 1 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించడం విశేషం. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా సాధించిన ఘనతగా నిలిచింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంట్రీ అంటే అభిమానులకు పండగ. ఇప్పుడు ‘ఓజీ’తో మరోసారి తన క్రేజ్‌ను నిరూపిస్తున్నారు. విడుదలకు మూడు వారాల ముందే ఇంతటి హంగామా చేయడం నిజంగా పవర్ స్టార్ స్టార్‌డమ్‌కే సాధ్యం.

ఇది కూడా చదవండి: Sunitha Daughter: అందంలో అమ్మనే మించిపోయిందిగా..! హీరోయిన్లకు పోటీ ఇస్తున్న సునీత కూతురు

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రతి పోస్టర్, గ్లింప్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచాయి. సినిమా విడుదలకు ముందు ఇంతటి బజ్ రావడం, వసూళ్ల పరంగా రికార్డులు బద్దలయ్యే సంకేతాలుగా కనిపిస్తున్నాయి.

సెప్టెంబర్ 25, 2025న ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు సుజీత్ ఈ సినిమాను యాక్షన్, ఎమోషన్‌ల మిశ్రమంగా తెరకెక్కించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం ఎస్. తమన్ అందిస్తున్నారు.

ప్రస్తుతం అమెరికా బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తున్న ‘ఓజీ’, విడుదల తరువాత ప్రపంచవ్యాప్తంగా మరింత రికార్డులు సృష్టించి మైలురాయి చిత్రంగా నిలవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *