Women World Cup IND vs PAK: వరుసగా నాలుగో ఆదివారం, భారత్ vs పాకిస్తాన్ క్రికెట్ మైదానంలో తలపడనున్నాయి. సెప్టెంబర్ 14, 21, 28 తేదీల్లో జరిగిన ఆసియా కప్‌లో రెండు దేశాల పురుషుల జట్లు తలపడ్డాయి. భారతదేశం మూడు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల క్రికెట్ తరువాత, ఇప్పుడు అమ్మాయిల వంతు వచ్చింది. ఈరోజు (05.10.2025)మహిళల వన్డే ప్రపంచ కప్ లీగ్ రౌండ్లో భారత్ – పాకిస్తాన్ తలపడతాయి. ఈ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది.
రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కో మ్యాచ్ ఆడాయి. భారత్ తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించగా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది.
పాకిస్తాన్ జట్టు భారత్ పై ఒక్క వన్డే కూడా గెలవలేదు..
భారతదేశం – పాకిస్తాన్(Women World Cup IND vs PAK) మధ్య సంబంధాలు దెబ్బతినడంతో క్రికెట్ లో జరిగే పోటీలు రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నంత సీన్ క్రియేట్ చేస్తాయి. క్రికెట్ అభిమానులే కాదు సాధారణ ప్రజలు కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగే పోటీని చాలా సీరియస్ గా తీసుకుంటారు. అయితే, మహిళల క్రికెట్ రికార్డు బుక్ లో పాకిస్తాన్ జట్టు భారత్‌కు ఏ మాత్రం సరితూగదని చెబుతుంది. ప్రపంచ కప్‌లో భారతదేశాన్ని ఓడించడం అనే మాట వదిలేస్తే.. అసలు పాకిస్తాన్ మహిళా జట్టు భారత్ పై ఇప్పటివరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా గెలవలేదు.
మహిళల వన్డేల్లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత్ 100% గెలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన 11 వన్డేల్లోనూ భారత్ గెలిచింది. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఈ ఇద్దరూ నాలుగుసార్లు తలపడ్డారు, నాలుగింటిలోనూ భారత్ గెలిచింది.
ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు ఉండొచ్చు . .
ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్‌ను తుది జట్టులో (Women World Cup IND vs PAK)చేర్చవచ్చు. ఈ నేపథ్యంలో క్రాంతి గౌన్‌ను పక్కన పెట్టె అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు తప్ప శ్రీలంకపై ఆడిన జట్టునే కొనసాగించవచ్చు .
మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ పరాజయం..
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఆ జట్టు 38.3 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
రెండు జట్లలో ఆడే XI(Women World Cup IND vs PAK) ఇలా ఉండవచ్చు . .
- భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, రేణుకా సింగ్/క్రాంతి గౌడ్ మరియు శ్రీ చరణి.
- పాకిస్థాన్: ఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ, ఒమైమా సోహైల్, సిద్రా అమీన్, అలియా రియాజ్, సిద్రా నవాజ్ (వికెట్ కీపర్), నటాలియా పర్వేజ్, రమీన్ షమీ, నష్రా సంధు, డయానా బేగ్ మరియు సాదియా ఇక్బాల్.
స్పిన్నర్లకు అనుకూలం . .
కొలంబో స్పిన్నర్లకు ఒక ముఖ్యమైన వేదికగా చెప్పవచ్చు. అక్కడ ఆడిన 22 మహిళల వన్డేల్లో 12 బ్యాటింగ్ జట్టుకు విజయాలు అందించగా, 10 మ్యాచ్‌లు ఛేజింగ్ జట్టుకు విజయాలు అందించాయి.
వాతావరణం ఇలా..
కొలంబోలో ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. మ్యాచ్ సమయంలో కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఈరోజు ఇక్కడ వర్షం పడే అవకాశం 100% ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది.
