Indo-Pak War: చైనా పాకిస్థాన్ కి నిజంగా సహాయం చేస్తుందా? యుద్ధంలో పాకిస్థాన్ తో కలిసివచ్చే దేశాలేవి?

Indo-Pak War

Indo-Pak War: పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారతదేశం మొత్తం తీవ్ర ఆగ్రహంతో ఉంది. పాకిస్థాన్ కు గట్టిగా బుద్దిచెప్పాల్సిందే అని ప్రజలంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. ఇప్పటికే భారత్ పలు కీలక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కూడా అంతే తీవ్రంగా స్పందిస్తూ వస్తోంది. భారత్ తో యుద్ధానికి సై అంటోంది. కానీ.. పాకిస్థాన్ వద్ద కనీసం ఏడూ రోజుల పాటు యుద్ధం చేయడానికి అవసరమైన మందుగుండు సామగ్రి కూడా లేదనే వార్తలు వస్తున్నాయి. యుద్ధం కోసం కావలసిన ఆయుధాలు పాకిస్థాన్ వద్ద పూర్తిస్థాయిలో లేవనేది గట్టిగా ప్రచారం అవుతోంది.

దీంతో పాకిస్థాన్ ఆయుధాల కోసం వివిధ దేశాల సహాయం కోసం ఎదురుచూస్తోంది. తమకు మద్దతు ఇచ్చే దేశాల కోసం వెతుకుతోంది. అయితే, పాకిస్థాన్ కు ప్రపంచవ్యాప్తంగా నేరుగా మద్దతు పలికే దేశాలు వేళ్ళ మీద లెక్కించేంతగా కూడా లేవనేది వాస్తవం. ఈ లిస్టులు చైనా, టర్కీ, అజర్‌బైజాన్ దేశాల పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. హమాస్ వంటి ఉగ్రవాద సంస్థ పాకిస్థాన్ కు మద్దతుగా ఉంది. 

Indo-Pak War: హమాస్ తో నేరుగా సంబంధాలు ఉండడమే పాకిస్థాన్ కు ప్రపంచ దేశాల్లో పెద్దగా మద్దతు లభించకపోవడానికి కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే, ఐసిస్ మద్దతు ఉన్న తీవ్రవాద సంస్థలు భారత్ లోనే కాకుండా.. అమెరికా, రష్యా, బ్రిటన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఇజ్రాయెల్ వంటి అనేక దేశాల్లో దాడులకు పాల్పడ్డాయి. అందుకే ఈ దేశాలేవీ కూడా పాకిస్తాన్ ను మద్దతు ఇచ్చే పరిస్థితిలేదు. 

Indo-Pak War: ఇక చైనా కూడా పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. దీనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. భారతదేశంతో దౌత్య సంబంధాలు సంతృప్తికరంగా లేనప్పటికీ, వాణిజ్య సంబంధాలు ముఖ్యమైనవి కాబట్టి చైనా దానిని పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. చైనాకు పాకిస్తాన్‌తో కంటే భారతదేశంతోనే ఎక్కువ వాణిజ్య ప్రణాళికలు ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తుందని అనుకున్నా.. పాకిస్తాన్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో ఆయుధాల అమ్మకం ద్వారా ఏ మాత్రం గిట్టుబాటు కాదు.

రష్యాపై జరిగిన యుద్ధంలో మాజీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్‌కు ఆయుధాలు – ఆర్థిక సహాయం అందించారు. అయితే, ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత, ఉక్రెయిన్ అధ్యక్షుడిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా అమెరికా ఉక్రెయిన్ ఖనిజ వనరులను స్వాధీనం చేసుకుంది. కానీ, చైనా అదే పద్ధతిలో పాకిస్తాన్ కు సహాయం చేయాలన్నా.. అక్కడ అలాంటి విలువైన ఖనిజ వనరులేవీ లేవు. దీనివలన చైనాకు లాభం ఉండదు. తనకు లాభం లేని పని చైనా చేసే అవకాశమే లేదు.

Indo-Pak War: మరోవైపు భారతదేశం రష్యాకు దగ్గరగా ఉన్నందున, చైనా రష్యా స్నేహపూర్వక సంబంధాలను విచ్ఛిన్నం చేసుకోవాలని అనుకోదు. అయితే, చైనా పాకిస్తాన్‌కు కొంత పరోక్ష ఆయుధ సహాయం అందించే అవకాశం ఉంది. “ఉద్రిక్తతను తగ్గించుకుని ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండటం మంచిది.” సమస్య మరింత తీవ్రం కావడానికి అనుమతించవద్దని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పాకిస్తాన్‌కు సూచించినట్టు వార్తలు వచ్చాయి. 

Indo-Pak War: హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు సయ్యద్ సలావుద్దీన్, జైషే మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్, లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయీద్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న అనేక మందికి పాకిస్తాన్ స్వర్గధామం. ఈ సంస్థలలో కొన్నింటి దగ్గర సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయి. పహల్గామ్‌లో పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాది హషీం ముసా M4 కార్బైన్‌ను ఉపయోగించాడు. వీటిని బాగా శిక్షణ పొందిన వ్యక్తులు మాత్రమే ఉపయోగించగలరు. అమెరికాలో తయారైన ఈ రకమైన రైఫిల్‌ను ఉగ్రవాదులు ఎలా పొందారనే అనుమానం తలెత్తుతోంది.

ఈ ఆయుధాన్ని సైనిక ప్రయోజనాల కోసం కొనుగోలు చేసినట్లయితే మాత్రమే దీనిని ఉపయోగించవచ్చు. ఇవి ఆఫ్ఘనిస్తాన్‌లోని నాటో దళాల నుండి తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తుపాకులుగా అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు దాన్ని పొందారా లేదా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఒకవేళ అదే జరిగితే వాళ్ళదగ్గర ఉన్న అత్యంత ఆధునిక ఆయుధం ఇదే అవుతుంది. అలా అని పూర్తి స్థాయి యుద్దానికి అవసరమైనంత ఆయుధాలు ఉండడం అనేది జరిగే పని కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *