Rashmika: వరుస హిట్స్ తొ మరో 100 కోట్ల క్లబ్ లో నేషనల్ క్రష్..రష్మిక

Rashmika

Rashmika: రష్మిక ఇటీవల వరుసగా హిట్లు కొడుతోంది. ఆమె సాధించిన విజయాలు చిన్నవేమీ కాదు. ఆమె నటించిన చాలా సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తున్నాయి. ఇప్పుడు ‘కుబేర’ వంతు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా కలెక్షన్లు కొల్లగొడుతోంది. రష్మిక సినిమా వస్తుంది అంటే పక్కా బొమ్మ హిట్టు అనే అంటున్నారు ప్రేక్షకులు. కెరీర్ మొదలు పెట్టిన దగ్గర నుండి ఈ అమ్మడు తనదైన మార్క్ చూపిస్తూనే వచ్చింది మధ్యలో కొన్ని ప్లాప్ లు చుసినా మళ్లీ కెరీర్ బెస్ట్ మూవీస్ తో కంబ్యాక్ ఇచ్చింది. ఇపుడు టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో ఈ ముద్దుగుమ్మ మూవీస్  రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరాయనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.

Rashmika: ఇక హీరోయిన్ రష్మిక ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఆమె నటించిన ‘పుష్ప 2’ సినిమా 1700 కోట్ల కు పైగా వసూలు చేసింది. అదేవిధంగా ‘యానిమల్’, ‘ఛావ’ సినిమాలు 500 కోట్ల క్లబ్‌లో చేరాయి. ‘పుష్ప’ పార్ట్ 1 300 కోట్ల కలెక్షన్లు సాధించాయి.

ఇది కూడా చదవండి: http://telanganaswaram.com/2025/06/26/kannappa-movie-team-warning/

Rashmika: ఇప్పుడు ఆమె నటించిన ‘కుబేర’ సినిమా కూడా రూ.100 కోట్ల మార్కును దాటింది. ఈ సినిమా వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రష్మిక,ధనుష్, నాగార్జునలతో కలిసి ‘కుబేర’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం గత శుక్రవారం (జూన్ 20) విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది.‘కుబేర’ సినిమా భారతదేశంలో 65.25 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. రష్మిక అభిమానులు దీని పట్ల చాలా సంతోషంగా ఉన్నారు.రష్మిక నటించిన ‘సికందర్’ సినిమా భారీ పరాజయం పాలైంది. అయినప్పటికీ, ఆ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *