CM Chandrababu: “ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు” – టీడీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక

CM Chandrababu

CM Chandrababu: తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రజల్లోకి వెళ్లే తత్వం లేకుండా నాయకుల భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు. “నా సూచనలు పాటిస్తే మళ్లీ ఎన్నికవుతారు.. లేదంటే ఇంటికే వెళ్తారు” అని తేల్చిచెప్పారు.

 “ఇంటికే కాదు… ప్రజల్లోకి వెళ్లండి!”

చంద్రబాబు స్పష్టం చేసిన మాటల్లో  “ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు. నాయకుడు మంచి పేరుతో ప్రజల్లో నిలవాలి. ఒక ఎమ్మెల్యే మంచివాడనే పేరొస్తే నాలుగు ఓట్లు అదనంగా వస్తాయి. చెడ్డవాడంటే ఓట్లు పోతాయి. పేరు కూడా ఓటు లెక్క.”సమావేశానికి గైర్హాజరు అయిన 56 మంది పై అసంతృప్తి ఈ సందర్భంగా 56 మంది ఎమ్మెల్యేలు, నేతలు సమావేశానికి హాజరుకాకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు.

ఇది కూడా చదవండి: Crime News: భార్యపై కత్తితో దాడి చేసిన వ్యక్తి – అడ్డొచ్చిన అత్తమామల హత్య

“పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దే సమాలోచన సమయాల్లో గైర్హాజరవడం బాధాకరం. ఇది సామాన్య సమావేశం కాదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “జనసేన, బీజేపీ శ్రేణులతో సమన్వయం అవసరం” ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన జనసేన మరియు బీజేపీ శ్రేణులతో సమన్వయంపై చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.“ఒక్కో పార్టీలో నాయకత్వ ధోరణులు వేరేలా ఉంటాయి. కానీ ప్రజల కోసం కలిసిపనిచేయాల్సిన సమయం ఇది. సమన్వయం లేకపోతే కూటమి బలహీనపడుతుంది” అని హెచ్చరించారు.ఇంటింటి ప్రచారం – విమర్శలు అర్థవంతంగా ఉండాలి

నాయకులు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వచ్చే విమర్శలపై బుద్ధిగా స్పందించాలన్నారు.“చేసిన పనులను చెప్పండి. చేయలేకపోయిన పనులకు కారణాలు వివరించండి. బూతులు తిట్టడం మన విధానం కాదు. విమర్శలు అర్థవంతంగా ఉండాలి. ప్రజలతో నిజాయితీగా మాట్లాడితేనే మద్దతు లభిస్తుంది” అని చంద్రబాబు సూచించారు.

 కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు స్పెషల్ సూచన

కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు తమకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని, ప్రజల మధ్యలో గట్టి బలం కల్పించుకోవాలని సూచించారు. “ఇది మీకు గుర్తింపు దక్కించే సమయం. మీ నిష్టను ప్రజలకు చూపించండి” అని ఆయన హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *