Bullet Train: భారత రైల్వే చరిత్రలో మైలురాయి గావబోతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు తుది దశలోకి చేరింది. ముంబై – అహ్మదాబాద్ కారిడార్‌లో 2026 నాటికి బుల్లెట్ రైలు ట్రయల్ రన్ మొదలయ్యే అవకాశం ఉంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ బుల్లెట్ రైలు భారత రవాణా రంగానికి ఊపిరిగా మారబోతోంది. ఇప్పటికే 508 కిలోమీటర్ల ప్రాజెక్ట్‌లో 310 కిలోమీటర్ల వయాడక్ట్ నిర్మాణం పూర్తి కాగా, అత్యంత క్లిష్టంగా భావించిన 21 కిలోమీటర్ల అండర్ వాటర్ టన్నెల్ పనులు సైతం పూర్తయ్యాయి.
Bullet Train: ప్రాజెక్ట్ వేగంగా ముందుకు పోతుండగా, ట్రాక్ నిర్మాణం, ఎలక్ట్రికల్ వ్యవస్థలు, స్టేషన్లు, బ్రిడ్జిల పనులు పటిష్టంగా సాగుతున్నాయి. 15 నదులపై బ్రిడ్జిలు ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం 12 స్టేషన్లలో 5 పూర్తవ్వగా, మరో మూడు తుది దశకు చేరుకున్నాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో భూమికి 32 మీటర్ల లోతులో నిర్మించనున్న స్టేషన్‌ను ‘ఇంజినీరింగ్ మార్వెల్’గా అధికారులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..
Bullet Train: ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా భారత్‌కు జపాన్ రెండు అత్యాధునిక షింకన్సెన్ బుల్లెట్ రైళ్లను – E5, E3 సిరీస్‌లను బహుమతిగా ఇవ్వనుంది. ఇవి 2026 ప్రారంభంలో భారత్‌కు డెలివరీ కానున్నాయి. ట్రాక్ స్థితి, ఉష్ణోగ్రత, ధూళి, వాయు నాణ్యత వంటి అంశాలపై డేటాను ఈ రైళ్లు సేకరిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా మేక్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్ల తయారీలో ఉపయోగించే E10 సిరీస్‌ను అభివృద్ధి చేయనుంది కేంద్రం.
Bullet Train: ఈ మార్గంలో థానే, విరార్, వాపి, సూరత్, వడోదర వంటి కీలక నగరాలు ఉన్న 12 స్టేషన్లలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాల్లో పూర్తవుతుంది. 2016లో భారత్-జపాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, దేశవ్యాప్తంగా మరో ఆరు బుల్లెట్ రైల్ కారిడార్ల కోసం కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Andhra Telangana Water Dispute: తెలుగు రాష్ట్రాల జల వివాదం ఢిల్లీకి చేరింది.. ఇద్దరు సీఎంలు, ఒకే టేబుల్‌పై!
Bullet Train: ఇక ఇటీవల బుల్లెట్ రైలు మీద వస్తున్న తప్పుడు వార్తలను కేంద్రం ఖండించింది. “ముంబై – అహ్మదాబాద్ మార్గంలో జపనీస్ బుల్లెట్ రైలు రాదు” అన్న ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పూర్తిగా తిప్పిపారేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. నిజానికి ఈ మార్గంలో జపనీస్ శంకన్సెన్ రైళ్లు సాక్షాత్తుగా పరుగులు తీయనున్నాయి.
వాస్తవానికి ఇది భారత రవాణా రంగానికి ఒక కొత్త శకం ప్రారంభం. వేగం, నాణ్యత, సౌకర్యం కలగలిపిన బుల్లెట్ ట్రైన్ ప్రయాణం.. ప్రజలకు సమయాన్ని ఆదా చేయడంతో పాటు దేశ ఆర్ధికాభివృద్ధికి గణనీయంగా తోడ్పడనుంది.
