Crime News: పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రేమ వ్యవహారం ఘోర హత్యగా మారింది. ప్రియురాలి బావ తన ప్రేమకు అడ్డుగా మారాడని భావించిన ఓ యువకుడు పక్కా స్కెచ్ వేసి, స్నేహితులతో కలిసి ఆయన్ని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Crime News: సాలూరు మండలం పురోహితినివలస గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను దేవుబుచ్చెంపేటకు చెందిన గుంట్రెడ్డి శ్యామ్ అలియాస్ శంకరరావు అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. మొదట్లో విద్యార్థిని అతనికి దూరంగా ఉండగా, తరువాత మెల్లగా అతనికి దగ్గరవుతూ వెళ్లింది. వీరిద్దరూ తరచూ కలుస్తూ, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు.
ఇది కూడా చదవండి: Andhra: అమావాస్య రోజున ప్రియురాలికి వశీకరణం.. గుట్టుగా గోడ దూకాడు.. ఆ తర్వాత జరిగిందిదే
Crime News: ఈ విషయం విద్యార్థిని కుటుంబ సభ్యులకు తెలియడంతో, వారు కడుపు మంటతో శ్యామ్‌ను హెచ్చరించారు. “ఆమె మైనర్.. వేధించొద్దు” అంటూ పలుమార్లు చెప్పినా శ్యామ్ తన ప్రవర్తనలో మార్పు చూపలేదు. అంతేగాక, విద్యార్థిని హాస్టల్లో ఉన్నప్పటికీ, తన స్నేహితుల సహాయంతో ఆమెకు మొబైల్ అందజేశాడు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు.
Crime News: ఈ క్రమంలో విద్యార్థినికి బావ అయిన అబ్దుల్ – శ్యామ్ సన్నిహిత స్నేహితుడు కావడం విశేషం. శ్యామ్ ప్రవర్తనపై నేరుగా మాట్లాడాలని భావించిన అబ్దుల్ ఒక రోజు రాత్రి శ్యామ్‌ను కలిసి “నా మరదలిని వదిలేయ్.. ఆమె చిన్న అమ్మాయి.. మన కుటుంబ పరువు పోతుంది” అని అర్థించాడు. ఈ మాటలు శ్యామ్‌కు తట్టక, కోపంతో ఊగిపోయి ప్లాన్ ప్రకారం అబ్దుల్‌ను హత్య చేయాలని నిర్ణయించాడు.
ఇది కూడా చదవండి: Odisha: 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం… గర్భవతిగా తేలడంతో సజీవంగా పాతిపెట్టే యత్నం
Crime News: ఘటన రోజు రాత్రి 11 గంటల సమయంలో శ్యామ్, అబ్దుల్‌ను తన వద్దకు రమ్మని ఫోన్ చేశాడు. స్నేహితుడిగా నమ్మిన అబ్దుల్ మరో స్నేహితుడితో కలిసి అక్కడికి వెళ్లాడు. అప్పటికే శ్యామ్ తన మరో ఐదుగురు మిత్రులతో మద్యం మత్తులో ఉన్నాడు. అబ్దుల్ వచ్చిన వెంటనే మాటల తుడిపాటైంది. క్షణాల్లో వాదన ఘర్షణగా మారి, శ్యామ్ కోపంతో పక్కన ఉన్న కత్తితో అబ్దుల్పై దాడి చేశాడు.
Crime News: ఈ దాడిలో తీవ్ర గాయాలైన అబ్దుల్‌ను అతని స్నేహితులు వెంటనే సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు తీవ్రమై చికిత్స పొందుతూ అబ్దుల్ అక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం శ్యామ్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. శ్యామ్‌తో పాటు హత్య సమయంలో అక్కడ ఉన్న మిగిలిన మద్యం మిత్రులపైనా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
Crime News: ఈ ఘటన విద్యార్థిని కుటుంబంలో కాకుండా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక ప్రేమ వ్యవహారం ఎంత దారుణమైన మలుపులు తీసుకుంటుందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
