Test Cricket: టెస్ట్ క్రికెట్ అనేది మిగతా అన్ని ఫార్మాట్ల కంటే ఎక్కువగా బ్యాటర్ నైపుణ్యం, సహనం, టెక్నిక్‌ను పరీక్షించేది. ఒక బ్యాటర్ టెస్ట్ మ్యాచులో డబుల్ సెంచరీ సాధించడం అనేది ఆ క్రికెటర్ నైపుణ్యానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. కానీ కొంతమంది మాత్రమే అటువంటి ఫీట్‌ను పునరావృతం చేస్తూ, తమ పేరు క్రికెట్ చరిత్రలో చెక్కించుకున్నారు. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధికంగా డబుల్ సెంచరీలు కొట్టిన టాప్ 5 బ్యాటర్ల వివరాలు ఇవే.
- డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా) – 12 డబుల్ సెంచరీలు
Test Cricket: డాన్ బ్రాడ్‌మాన్‌ను క్రికెట్ దేవుడిగా గుర్తించడంలో ఆశ్చర్యం లేదు. అతను కేవలం 52 టెస్ట్ మ్యాచ్‌ల్లోనే 12 డబుల్ సెంచరీలు సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అతని బ్యాటింగ్ సగటు 99.94, ఇది ఇప్పటికీ టెస్ట్ చరిత్రలో అజేయంగా ఉంది. 80 ఇన్నింగ్స్‌ల్లో 6996 పరుగులు చేసి, 334 పరుగులు అతని అత్యధిక స్కోరు.
- కుమార్ సంగక్కర (శ్రీలంక) – 11 డబుల్ సెంచరీలు
Test Cricket: శ్రీలంక దిగ్గజం సంగక్కర టెక్నికల్‌గా అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. అతను 134 టెస్టుల్లో 12400 పరుగులు చేసి, 11 డబుల్ సెంచరీలు సాధించాడు. 233 ఇన్నింగ్స్‌ల్లో అతని అత్యధిక స్కోరు 319 కాగా, సగటు 57.40. గౌరవంగా, స్థిరంగా ఆటతీరు సాగిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించాడు.
- బ్రియన్ లారా (వెస్టిండీస్) – 9 డబుల్ సెంచరీలు
Test Cricket: స్టైలిష్ ఆటతీరు, అద్భుతమైన కదలికలు, ఆరాచక ఆటతీరు.. ఇవన్నీ కలిపి బ్రియన్ లారాను క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిపాయి. అతను 131 టెస్ట్‌ల్లో 9 డబుల్ సెంచరీలు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 400* – ఇది టెస్ట్ చరిత్రలో ఇప్పటికీ సర్వోన్నతంగా ఉంది.
- వాలీ హమ్మండ్ (ఇంగ్లాండ్) – 7 డబుల్ సెంచరీలు
Test Cricket: ఇంగ్లాండ్‌కు చెందిన వాలీ హమ్మండ్ క్రికెట్ ప్రాథమిక దశల్లో అత్యున్నత బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. అతను 85 టెస్ట్ మ్యాచ్‌ల్లో 7 డబుల్ సెంచరీలు చేశాడు. 140 ఇన్నింగ్స్‌ల్లో 7249 పరుగులు చేయడం గమనార్హం. అతని అత్యధిక స్కోరు 336*.
- విరాట్ కోహ్లీ (భారత్) – 7 డబుల్ సెంచరీలు
Test Cricket: ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన ఫిట్నెస్, ఫోకస్, టెక్నిక్‌తో టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. 123 టెస్ట్‌ల్లో 7 డబుల్ సెంచరీలు కొట్టాడు. మొత్తం 210 ఇన్నింగ్స్‌ల్లో 9230 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 254* కాగా, సగటు 46.85.
ఈ ప్లేయర్లు ఒక్కోసారి మాత్రమే కాదు, మళ్లీ మళ్లీ డబుల్ సెంచరీలు సాధించి క్రికెట్లో తమ సత్తా చాటారు. వీరి ఆటతీరు కొత్త తరం క్రికెటర్లకు మార్గదర్శకంగా నిలుస్తోంది. టెస్ట్ క్రికెట్‌కి గౌరవం తీసుకురావడంలో వీరి పాత్ర అపూర్వం.
