Health Tips: జీడిపప్పు తింటున్నారా? అయితే ఇవి మీకు తప్పక తెలుసుండాల్సిన ఆరోగ్య సూచనలు!

Health Tips

Health Tips: జీడిపప్పు అనగానే మనం ముందుగా గుర్తుచేసుకునేది దాని రుచి. హల్వా, స్వీట్లు, భిర్యానీ, పులావ్ వంటి ఎన్నో వంటల్లో దీనిని ఉపయోగిస్తాం. కొంతమంది అయితే నేరుగా జీడిపప్పు తినడం ఎంతో ఇష్టపడతారు. అయితే రుచికరమైన ఈ డ్రైఫ్రూట్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఎక్కువగా తినడం వల్ల కొన్ని అనూహ్యమైన సమస్యలు తలెత్తవచ్చు.

Health Tips: ఆరోగ్య నిపుణుల ప్రకారం, జీడిపప్పులో ఆరోగ్యానికి ఉపయోగకరమైన కొవ్వులు మాత్రమే కాకుండా, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫైబర్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చే దానితో పాటు, రక్తహీనతను నివారించడంలో కూడా ఉపయోగపడతాయి. అయితే ఇవి మోతాదు మించి తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఒత్తిడి పెరగడం, అలెర్జీలు, కడుపునొప్పులు, వాంతులు, అలసట, ఉబ్బరం వంటి సమస్యలు రావొచ్చు.

ఇది కూడా చదవండి: Ap Cm Chandrababu: సింగపూర్ పర్యటనలో చంద్రబాబుకు ఉత్సాహకర స్పందన.. పెట్టుబడులపై కీలక చర్చలు

Health Tips: నిపుణుల సిఫారసు ప్రకారం, సాధారణ ఆరోగ్యవంతులైన వారు రోజుకు 5 నుంచి 10 జీడిపప్పులు మాత్రమే తినడం ఉత్తమం. మీరు ఫిట్‌నెస్, బాడీ బిల్డింగ్, వర్కౌట్స్ చేసే వారు అయితే, 15 నుంచి 30 జీడిపప్పులు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మీ జీవనశైలిని బట్టి జీడిపప్పు మోతాదును తగ్గించాలా లేదా పెంచాలా అనేది డైటీషియన్ సలహాతోనే నిర్ణయించాలి.

Health Tips: ఎక్కువ శారీరక శ్రమ చేసేవారి శరీరం తిన్న ఆహారాన్ని త్వరగా శక్తిగా మారుస్తుంది. కానీ సాధారణ జీవనశైలిలో ఉన్నవారికి శక్తి ఖర్చు తక్కువగా ఉంటుంది. అందుకే వారే ఎక్కువగా తినితే, అవి శరీరంలో కొవ్వుగా నిల్వవుతాయి. ఇది బరువు పెరగడానికే కాదు, ఇతర ఆరోగ్య సమస్యలకూ దారితీయవచ్చు.

Health Tips: అంతేకాదు, కొన్ని సందర్భాల్లో జీడిపప్పు అలెర్జీకి కూడా కారణమవుతుంది. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు జీడిపప్పు తినేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల జీడిపప్పు తినేటప్పుడు ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, సరైన పరిమితిలో మాత్రమే తీసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తీరుగా తినండి – ఆరోగ్యంగా ఉండండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *