Divya Deshmukh: చెస్ ప్రపంచానికి కొత్త క్వీన్ దివ్య.. హంపైనే ఓడించేసిందిగా!

Divya Deshmukh

Divya Deshmukh: అతి చిన్న వయసులో ఫిడే మహిళల ప్రపంచ కప్ ను గెలుచుకుని సంచలనం సృష్టించింది భారత యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్‌. ఏమాత్రం అంచనాలు లేకుండా.. ఇంకా చెప్పాలంటే చెస్ ప్రపంచంలో అతి చిన్న స్థాయిలో ఉన్న దివ్య.. తనకన్నా ఎన్నోరెట్లు మెరుగైన ర్యాంకింగ్స్ లో ఉన్న వారిని మట్టికరిపించి ప్రపంచ కప్ గెలుచుకుని సంచలనం సృష్టించింది. టోర్నమెంట్ మొత్తం అద్భుత ప్రతిభ కనబరిచిన దివ్య ఫైనల్స్ లో తెలుగమ్మాయి కోనేరు హంపి పై సంచలనం విజయం సాధించింది.

Divya Deshmukh: నువ్వా.. నేనా అన్నట్టు సాగిన ఈ ఫైనల్లో దివ్య ఆమె టైబ్రేక్‌లో 1.5.0.5తో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిని నిలువరించి టైటిల్ ఎగరేసుకుపోయింది. జూలై 28న జరిగిన  తొలి ర్యాపిడ్‌ టైబ్రేకర్‌ను హంపి, దివ్య డ్రాగా ముగించారు. రెండో టైబ్రేకర్‌లో నెగ్గడం ద్వారా దివ్య విజేతగా నిలిచింది. చివరి వరకూ అత్యంత పట్టుదలగా ఆడిన దివ్యకు బోనస్‌గా గ్రాండ్‌మాస్టర్‌ హోదా కూడా లభించింది. దీంతో హంపి, హారిక, వైశాలి తర్వాత జీఎం అయిన భారత నాలుగో మహిళగా దివ్య ఘనత సాధించింది. 

ఇది కూడా చదవండి: Viral Post: ఇది మెట్రోరైల్‌ బ్రో.. బెడ్‌రూమ్‌ కాదు.. మెట్రోలో ప్రయాణికుల హెచ్చరిక

Divya Deshmukh: ప్రస్తుతం 38 ఏళ్ల హంపి 2002లో గ్రాండ్‌మాస్టర్‌ అయింది. ఆమె గ్రాండ్ మాస్టర్ అయ్యేటప్పటికి  దివ్య పుట్టలేదు. దివ్య విజయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. “ఈ చరిత్రాత్మక ఫైనల్లో ఇద్దరు మేటి భారత క్రీడాకారిణులు తలపడ్డారు. దివ్య ఫిడే మహిళల ప్రపంచకప్‌ విజేత అయినందుకు గర్వంగా ఉంది. ఈ గొప్ప ఘనత సాధించిన ఆమెకు అభినందనలు. దివ్య విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుంది. కోనేరు హంపి కూడా టోర్నీ ఆసాంతం బాగా ఆడింది. ఇద్దరికీ శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

Divya Deshmukh: ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. నిజానికి ఈ టోర్నీ గెలిస్తే గ్రాండ్ మాస్టర్ హోదా రాదు. కానీ, దివ్య ఈ ఘనత సాధించింది. ఈ టోర్నీ ముందు వరకూ దివ్య గ్రాండ్ మాస్టర్ హోదా దరిదాపుల్లో కూడా లేదు. సీడింగ్స్‌లో చాలా మంది గ్రాండ్‌మాస్టర్ల వెనుక ఎక్కడో 15వ స్థానం. ప్రతిభావంతురాలే అయినా, ఇటీవల ప్రదర్శనతో ఆకట్టుకున్నా పెద్దగా ఆమె మీద ఈ టోర్నీలో అంచనాలు ఏమీ లేవు. ఇక దివ్య సంప్రదాయానికి భిన్న రీతిలో గ్రాండ్‌మాస్టర్‌ హోదాను దక్కించుకుంది.

ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: భారత్-పాక్ మ్యాచ్ చూడటానికి నా మనస్సాక్షి అంగీకరించదు

Divya Deshmukh: సాధారణంగా జీఎం కావాలంటే మూడు గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌లు సంపాదించడంతో పాటు 2500 లేదా అంతకన్నా ఎక్కువ ఫిడే రేటింగ్‌ కలిగి ఉండాలి. టోర్నీకి ముందు వరకు దివ్యకు ఒక్క గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌ కూడా లేదు. అయితే నిబంధనల ప్రకారం ఫిడే మహిళల ప్రపంచకప్‌ వంటి అగ్రశ్రేణి టోర్నీల్లో నెగ్గడం ద్వారా కూడా జీఎం కావొచ్చు. ఇప్పుడు దివ్య అలాగే అయింది. భారత్‌ నుంచి ఆమె 88వ గ్రాండ్‌మాస్టర్‌. 

అదండీ విషయం.. కోనేరు హంపి గ్రాండ్ మాస్టర్ అయినపుడు కనీసం పుట్టని ఒక అమ్మాయి.. ఆమెను ఓడించి ప్రపంచ ఛాంపియన్ షిప్ కొట్టేసింది పంతొమ్మిదేళ్ళ దివ్య దేశ్‌ముఖ్‌. ఇప్పుడు దివ్య భారతదేశ భవిష్యత్ చెస్ ప్రపంచానికి యువరాణి అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *