Nara Lokesh: ఓ తండ్రి ప్రేమ.. కొడుకురికోసం ఒక్కరోజు సెలవు తీసుకున్న లోకేష్!

Nara Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా అనేక బాధ్యతలు భుజాలపై వేసుకున్న నారా లోకేష్‌కు పని వేళలు లేని రోజే లేదు. ఐటీ, హెచ్ఆర్డీ మంత్రిగా ఉండటంతోపాటు పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక రంగ అభివృద్ధి వంటి అంశాల్లో నిత్యం బిజీగా ఉంటారు. అయినా తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అందరి మనసులను గెలుచుకుంది.

Nara Lokesh: ఆగస్టు 2, శనివారం — ఈ రోజు మాత్రం లోకేష్ పూర్తిగా తన కొడుకు దేవాన్ష్ కోసం కేటాయించారు. దేవాన్ష్ పాఠశాలలో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేకంగా సెలవు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ హృద్యమైన సందేశంతో పంచుకున్నారు.

“ఇవే జీవితాన్ని అర్థవంతం చేసే క్షణాలు” – లోకేష్ ట్వీట్

Nara Lokesh: “ఈరోజు దేవాన్ష్‌కి స్కూల్‌లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. ఆ సందర్భం కోసం సెలవు తీసుకున్నా. పబ్లిక్ లైఫ్ ఎప్పుడూ పరుగుల్లో ఉంటుంది కదా.. అందుకే ఇలాంటి క్షణాలు మరింత విలువైనవిగా అనిపిస్తాయి. దేవాన్ష్‌ ప్రపంచం, అతని కథలు, నవ్వు అన్నీ చూసి ఓ తండ్రిగా గర్వంగా ఉంది.
We are proud of you, Devaansh!”

ఈ ట్వీట్ ప్రజల హృదయాలను తాకింది. అధికారిక బాధ్యతల మధ్య ఒక తండ్రిగా తన పాత్రను సజీవంగా చాటిన లోకేష్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రజా నాయకుడిగా కాదు, తండ్రిగా..!

Nara Lokesh: సాధారణంగా రాజకీయ నాయకులు తమ కుటుంబం కోసం సమయం కేటాయించలేని స్థితిలో ఉంటారు. కానీ లోకేష్ తన బిజీ షెడ్యూల్ మధ్యలో కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ, తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయం. ఒక ప్రముఖ నేతగా కాకుండా, ఒక సాధారణ తండ్రిగా తన ప్రేమను ప్రదర్శించిన తీరు యువతలో మెచ్చుకోతకు గురైంది.

నారా లోకేష్ తీసుకున్న ఈ చిన్న నిర్ణయం కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమో నొక్కిచెబుతోంది. తండ్రిగా చూపిన ప్రేమతో ఆయన మనసులను గెలుచుకున్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందో ఇదే ఉదాహరణగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *