Dog Attack: ఒడిశా రాష్ట్రం బోలాంగీర్ జిల్లా తుషురా పోలీస్స్టేషన్ పరిధిలోని చించేరా గ్రామంలో పిచ్చికుక్క దాడి విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో జాతీయ స్థాయి పారా అథ్లెట్ జోగేంద్ర ఛత్రియా (33) ఇంకా రైతు హృషీకేశ్ రాణా (48) ప్రాణాలు కోల్పోయారు. జూలై 23న చోటుచేసుకున్న ఈ ఘటనలో, ఒకే రోజు గ్రామంలోని ఆరు ప్రదేశాల్లో ఆరుగురు గ్రామస్థులపై కుక్క దాడి చేసింది. దాడికి గురైన వారిలో పాఠశాల విద్యార్థులు కూడా ఉండటం గ్రామంలో మరింత భయాందోళన కలిగించింది.
Dog Attack: దాడి తర్వాత గాయపడిన వారిని తొలుత బోలాంగీర్ జిల్లా ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం బుర్లాలోని విమ్సార్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్కు తరలించారు. నలుగురు చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరుకోగా, జోగేంద్ర మరియు హృషీకేశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స కొనసాగించారు. అయితే శనివారం అర్ధరాత్రి ఇద్దరూ మృతి చెందారు.
ఇది కూడా చదవండి: Crime News: తమ్ముడిపై కసితో ఘోరానికి పాల్పడ్డ మైనర్ బాలుడు.. హత్యకేసు వెనుక షాకింగ్ నిజాలు
Dog Attack: జోగేంద్ర ఛత్రియా, శారీరక వైకల్యం ఉన్నప్పటికీ, కష్టపడి పారా అథ్లెటిక్స్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అంతర్జాతీయ ఫ్లోర్బాల్ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణం క్రీడా రంగానికే కాకుండా గ్రామానికీ తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. హృషీకేశ్ రాణా గ్రామంలో సహృదయంతో, అవసరమైన వారికి సహాయం చేసే వ్యక్తిగా పేరుపొందారు.
ఈ ఘటనతో చించేరా గ్రామ ప్రజలు తీవ్ర షాక్లో మునిగిపోయారు. విచ్చలవిడిగా తిరిగే పిచ్చికుక్కలు, వీధి కుక్కలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
