Baahubali Epic: మరోసారి థియేటర్స్‌లో బాహుబలి హంగామా..ఒకే పార్ట్ గా ప్రేక్షకుల ముందుకి!

Baahubali Epic

Baahubali Epic: తెలుగు సినిమా గర్వకారణంగా నిలిచిన బాహుబలి మరోసారి థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 2015 జూలై 10న విడుదలైన బాహుబలి: ది బిగినింగ్ సినిమా 2025లో 10 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రెండు భాగాలుగా విడుదలైన బాహుబలి: ది బిగినింగ్ ఇంకా బాహుబలి: ది కన్‌క్లూజన్ చిత్రాలను కలిపి, ఒకే సినిమాగా రూపొందించిన బాహుబలి: ది ఎపిక్ అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Baahubali Epic: ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ ఎపిక్ చిత్రం, విడుదల సమయంలోనే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ప్రభాస్‌ను పాన్-ఇండియా స్టార్‌గా నిలిపిన ఈ ప్రాజెక్ట్, రానా ప్రతిభకు కూడా విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇది కూడా చదవండి: Crime News: ఇదేందిరయ్య మొదటి భార్యతో మాట్లాడినందుకు భర్తపై రెండో భార్య దాడి

Baahubali Epic: రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్-వరల్డ్ స్థాయిలో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే సమయంలో, బాహుబలి: ది ఎపిక్ ప్రాజెక్ట్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం టీజర్‌ను ఆగస్టు 14న విడుదల చేయనున్నారు. ఇదే రోజున రజినీకాంత్ కూలీ మరియు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలి: ది ఎపిక్ టీజర్ కూడా థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించబడనుంది.

రెండు భాగాల చిత్రాన్ని కలిపి ఒకే సినిమాలోకి మలచిన ఈ కొత్త వెర్షన్‌లో సన్నివేశాల్లో ఎలాంటి మార్పులు చేశారా, లేక కొత్త సన్నివేశాలు జోడించారా అన్నది అక్టోబర్‌లోనే ప్రేక్షకులకు తెలుస్తుంది. ఇండస్ట్రీలో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో, బాహుబలి మళ్లీ థియేటర్స్‌ను షేక్ చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *