Adaso Kapesa: మారుమూల గ్రామం నుండి ప్రధాని భద్రతా బృందంలోకి – అదాసో కపేసా విజయగాథ

Adaso Kapesa

Adaso Kapesa: మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని కైబి అనే చిన్న గ్రామం నుంచి బయలుదేరి, దేశంలోని అత్యున్నత భద్రతా విభాగం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ (SPG)లో చేరిన తొలి మహిళగా అదాసో సోనా కపేసా చరిత్ర సృష్టించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ UK పర్యటన సందర్భంగా ఆమె నల్లటి సూట్‌లో భద్రతా విధుల్లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఆమె ప్రయాణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Adaso Kapesa: కపేసా విద్యను స్థానిక పాఠశాలలో పూర్తిచేసి, సశస్త్ర సీమా బల్‌ (SSB)లో చేరారు. ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌లోని 55వ బెటాలియన్‌లో విశిష్ట సేవలందిస్తూ, తన క్రమశిక్షణ, దృఢ సంకల్పంతో సీనియర్ అధికారుల గుర్తింపును పొందారు. కఠినమైన కమాండో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, 2020లో SPG కోసం ఎంపికయ్యారు. 2024లో ప్రధాని ప్రధాన భద్రతా బృందంలో అధికారికంగా చేరారు.

ఇది కూడా చదవండి: Crime News: ఇదేందిరయ్య మొదటి భార్యతో మాట్లాడినందుకు భర్తపై రెండో భార్య దాడి

Adaso Kapesa: SPGలో ఎంపిక కావడం అత్యంత కఠినమైన ప్రక్రియ. అభ్యర్థులు ఆయుధ శిక్షణ, మార్షల్ ఆర్ట్స్, బాంబు నిర్వీర్యం, రహస్య ఆపరేషన్ల సిద్ధత వంటి కఠినమైన శారీరక, మానసిక పరీక్షలను అధిగమించాలి. SPG ప్రధానంగా ప్రధాని ఇంకా ఆయన కుటుంబ సభ్యుల భద్రతను చూసుకుంటుంది. 1985లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం ఏర్పడిన ఈ విభాగం, దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక భద్రతా సంస్థగా ప్రసిద్ధి చెందింది.

అడాసో కపేసా SPGలో చేరడం, పురుషాధిక్య దళంలో మహిళల స్థానం పెరుగుతున్న సంకేతం. మారుమూల గ్రామం నుండి దేశ అత్యున్నత భద్రతా బృందం వరకు ఆమె ప్రయాణం, కష్టపడి పని చేస్తే, క్రమశిక్షణ, ధైర్యం ఉంటే ఏ అడ్డంకుల్నైనా అధిగమించవచ్చని నిరూపించింది. ఆమె కథ అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *