Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సందడి మొదలైంది. ఆదివారం (సెప్టెంబర్ 7) సాయంత్రం 7 గంటలకు జరగనున్న గ్రాండ్ లాంచ్‌కు ముందే మేకర్స్ ప్రోమోను రిలీజ్ చేశారు. ‘ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు.. డబుల్ హౌజ్‌తో.. డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9′ అంటూ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఈ ప్రోమో మొదలైంది.
Bigg Boss Telugu 9: ఎప్పటిలాగే కలర్‌ఫుల్ సూట్‌తో నాగార్జున బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. నాగ్ స్వాగ్, స్టైల్, లుక్ అదిరిపోయిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా సెట్ చేసిన బిగ్ బాస్ హౌస్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఎప్పటిలాగే కంటెస్టెంట్ల ఫేస్‌లను రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. అయితే ప్రోమోలో కొన్ని క్లూస్ ఇచ్చారు. సూట్‌కేస్‌తో కనిపించిన వ్యక్తి జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ అని చాలామంది గెస్ చేస్తున్నారు. ఇక “ఇందు వదన, సుందర వదనా వావ్” అంటూ వినిపించిన చిరంజీవి స్లాంగ్ వాయిస్ కూడా ఇమ్మాన్యుయేల్ అనే అంచనాలను బలపరిచింది.
ఇది కూడా చదవండి: Mahesh Babu Sridivya: మహేష్ బాబును అన్న అన్న అని పిలిచేదాన్ని.. చాక్లెట్స్ కూడా ఇచ్చేవాడు – శ్రీదివ్య
‘పిక్చర్ అబీ బాకీ హై’ అని చెప్పినది హీరోయిన్ ఆశా శైనీ అని సోషల్ మీడియాలో చర్చ. హాకీ స్టిక్ పట్టుకుని కనిపించిన వ్యక్తి సీరియల్ నటుడు భరణి అని అభిమానులు ఊహిస్తున్నారు.
ప్రోమోలో ఓ మేల్ కంటెస్టెంట్ బాక్స్ పట్టుకుని బిగ్ బాస్ వేదికపైకి వస్తాడు. ఆ బాక్స్‌ను లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వకపోవడంతో అతను ‘అయితే నేను ఇంటికి వెళ్లిపోతాను’ అంటూ స్వయంగా ఎలిమినేట్ అవుతాడు. దీనిపై నాగార్జున ‘నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు.. కానీ హౌజ్‌లోకి కాదు’ అని చెప్పిన డైలాగ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
ఈసారి కామనర్స్ కేటగిరీలో కల్కి, దాలియా లాంటి కంటెస్టెంట్లను నాగార్జునతో సరదాగా పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేసింది.
Commoners with raw fire 🔥 vs Celebrities with star power ✨ Double surprises 💥 Double entertainment 🎭 Double the dose of Bigg Boss 👁️💥
Catch the Grand Launch of #BiggBossSeason9 Tonight at 7PM on #StarMaa#BiggBossTelugu9 #BiggBossTelugu9GrandLaunch pic.twitter.com/QRy6zQ7X7R
— Starmaa (@StarMaa) September 7, 2025
