Fighter Shiva: టాలీవుడ్ కమెడియన్ సునీల్ మరోసారి తనలోని విభిన్నమైన నటనను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోగా తనదైన ముద్ర వేసిన సునీల్, ఆ తర్వాత విలన్‌గానూ మెప్పించారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం **‘ఫైటర్ శివ’**తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
కౌండిన్య ప్రొడక్షన్స్, అరుణ గిరి ఆర్ట్స్ బ్యానర్లపై ఉన్నం రమేష్, నర్సింహ గౌడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఫైటర్ శివ’లో సునీల్ సరసన మణికాంత్, ఐరా బన్సాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా, ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ వశిష్ట కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇది కూడా చదవండి : 12 సినిమాలు చేసినా 10 ప్లాప్స్..సోషల్ మీడియా స్టార్ కి తగ్గని క్రేజ్
Fighter Shiva: తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను శనివారం (ఆగస్ట్ 16న) విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా ‘ఫైటర్ శివ’ టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ టీజర్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉండి, సునీల్‌ను ఒక పవర్ఫుల్ పాత్రలో చూపిస్తోంది. టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది, సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
