Viral News: ఎనిమిదేళ్లు ఛాతీలో కత్తితో జీవించిన వ్యక్తి.. చివరికి డాక్టర్లు గుర్తించిన షాకింగ్ నిజం!

Viral News: ఓ వ్యక్తి తన ఛాతీలో కత్తి బ్లేడ్‌తో ఎనిమిదేళ్ల పాటు జీవించడం ఆశ్చర్యకరంగా మారింది. ఇటీవల ఆస్పత్రిలో పరీక్షల కోసం వెళ్లిన ఆ వ్యక్తిని చూసి వైద్యులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

Viral News: 44 ఏళ్ల సదరు వ్యక్తి కుడివైపు ఛాతి కింద ఇన్ఫెక్షన్ రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లాడు. అతడికి ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు మాత్రమే ఉండేవి. మొదట డాక్టర్లు సాధారణ సమస్యగా భావించినా, రేడియోగ్రాఫ్ చేసినప్పుడు ఆశ్చర్యకరమైన వాస్తవం బయటపడింది. అతడి ఛాతీ మధ్యలో ఒక పెద్ద కత్తి బ్లేడ్ ఇరుక్కుపోయినట్టు గుర్తించారు.

ఇది కూడా చదవండి: Crime News: వేధింపులు భరించలేక.. మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

దాదాపు దశాబ్దం క్రితం జరిగిన సంఘటనలో తన ముఖం, వీపు, ఛాతి, ఉదరంపై గాయాలు కావడంతో చికిత్స పొందినప్పటికీ.. ఆ కత్తి బ్లేడ్ శరీరంలోనే ఇరుక్కుపోయిందని ఆయనకు కూడా తెలియలేదట. తాజాగా ఛాతీ కింద చీము రావడంతో మళ్లీ ఆస్పత్రి వెళ్లి టెస్టులు చేయించుకున్నాడు.

శస్త్రచికిత్స ద్వారా డాక్టర్లు ఆ బ్లేడ్‌ను జాగ్రత్తగా తొలగించడంతో పాటు చీము కూడా క్లియర్ చేశారు. 24 గంటల పాటు ఐసీయూలో ఉంచి, తర్వాత సాధారణ వార్డుకు తరలించారు. పది రోజుల తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు తెలిపారు.

ఈ అరుదైన ఘటనను టాంజానియాలోని ముహింబిలి నేషనల్ హాస్పిటల్ వైద్యులు ఇటీవల జర్నల్ ఆఫ్ సర్జికల్ కేస్ రిపోర్ట్స్ లో నమోదు చేశారు. ఎనిమిదేళ్ల పాటు ఛాతీలో కత్తి బ్లేడ్‌తో జీవించి కూడా, ఎలాంటి ప్రధాన అవయవాలకు హాని జరగకపోవడం వైద్యులను కూడా ఆశ్చర్యపరిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *