Anganwadi Jobs 2025: తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,274 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో 2,999 టీచర్ పోస్టులు, 12,275 సహాయకుల పోస్టులు ఉన్నాయి. త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
Anganwadi Jobs 2025: ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ కారణంగా పోషకాహారం పంపిణీ, పూర్వప్రాథమిక విద్య వంటి కీలక సేవలు సక్రమంగా అందడం లేదు. సహాయకులు లేని కేంద్రాల్లో పిల్లలకు ఆహారం అందించడం కష్టసాధ్యమవుతుండగా, టీచర్లు లేని చోట విద్యా బోధన దాదాపు ఆగిపోయింది.
ఇది కూడా చదవండి: Navaratri 2025: ఈ ఏడాది నవరాత్రి 22 లేదా 23 ఎప్పుడు ప్రారంభం అవుతాయి?
నియామక విధానంపై ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పద్ధతులను పరిశీలించింది.
- ఆంధ్రప్రదేశ్లో: పదో తరగతి అర్హతతో పరీక్షలు, మౌఖిక పరీక్షలకు 20 మార్కులు.
- కర్ణాటకలో: 12వ తరగతి అర్హత, ఈసీసీఈ, నర్సరీ, ఎన్టీటీ డిప్లొమా కలిగిన వారికి ప్రాధాన్యం.
- కేరళలో: ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా ఎంపిక.
- తమిళనాడులో: టీచర్ పోస్టులకు ఇంటర్, హెల్పర్కు పదో తరగతి అర్హతలు, మెరిట్ ఆధారంగా ఎంపిక.
- తెలంగాణలో: ఇంతవరకు ఇంటర్ అర్హతతో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తుండగా, కొత్త నివేదిక ఆధారంగా మార్పులు చేసే అవకాశం ఉంది.
శిశు సంక్షేమశాఖ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం విద్యార్హతలు, ఎంపిక విధానంలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్హతలు, వయోపరిమితి, అప్లికేషన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
