Volcano Eruption: సముద్రంలో అగ్నిపర్వతం భారీ విస్ఫోటనం.. షాకింగ్ వీడియో!

Volcano Eruption: సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. సముద్రం మధ్యలో ఉన్న మౌంట్ స్ట్రోంబోలి అగ్నిపర్వతం పేలిన దృశ్యాలను పడవలో ప్రయాణిస్తున్న కొంతమంది చిత్రీకరించారు. కేవలం 28 సెకన్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం లక్షలాది మంది వీక్షించడంతో పాటు, వేలాది లైక్‌లు, కామెంట్లు సొంతం చేసుకుంది.

Volcano Eruption: ఇటలీలో ఉన్న మౌంట్ స్ట్రోంబోలి అగ్నిపర్వతం సుమారు 200,000 సంవత్సరాల పురాతనమైందిగా భావిస్తారు. ప్రపంచంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఇది ఒకటి. పడవలో ప్రయాణిస్తున్న వారిలో కొందరు ఈ విస్ఫోటనాన్ని కెమెరాలో బంధించారు. వీడియోలో అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న మంటలు, బూడిద, దానితో సముద్రం అలజడిగా మారిన క్షణాలు భయానకంగా కనిపిస్తున్నాయి.

వీడియోలో పడవ నడిపే వ్యక్తి వేగంగా ఆ ప్రాంతం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అగ్నిపర్వతం నుంచి వచ్చిన బూడిద మొత్తం ఆకాశాన్ని కప్పేసింది. ఆ దృశ్యం అణుబాంబు పేలుడు వంటి భయంకర దృశ్యాన్ని తలపిస్తుంది. ఈ సంఘటనలో ఎవరికీ హాని జరిగిందా అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియలేదు.

ఈ వీడియోను ట్విట్టర్‌లో @AMAZlNGNATURE అనే ID షేర్ చేసింది. ‘నావికులు మౌంట్ స్ట్రోంబోలి విస్ఫోటనాన్ని సంగ్రహించారు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షలకుపైగా వీక్షించారు.

వీడియో చూసిన తర్వాత ఒక వినియోగదారుడు, “నేను ఇప్పటివరకు నీటిలో చూసిన అత్యంత భయంకరమైన విషయం ఇదే” అని కామెంట్ చేశాడు. మరొకరు, “ఇది సినిమాలోని సన్నివేశంలా ఉంది” అని రాశారు. ఇంకొకరు, “ఈ పరిస్థితిలో అత్యంత విషాదకర విషయం ఏమిటంటే బూడిద, నీరు రెండూ ప్రాణాలను తీయగలవు” అని వ్యాఖ్యానించారు.

సముద్రం మధ్యలో అగ్నిపర్వతం పేలిన దృశ్యం చూసిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యేలా ఉంది. నిజంగా ఇది సినిమాల్లోనే చూడగలిగే రేర్ సీన్ అని చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *