Bengaluru Metro: బాదుడే బాదుడు.. మెట్రోలో బ్యాగ్ తీసుకెళ్తే ఛార్జ్ తప్పనిసరి

Bengaluru Metro: బెంగళూరు మెట్రో ప్రయాణికులు ఇప్పుడు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మెట్రోలో చిన్న లగేజీతో ప్రయాణం పెద్ద సమస్య కాదు. కానీ, ఒక ప్రయాణికుడి అనుభవం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

Bengaluru Metro: బెంగళూరు నివాసి అవినాష్ చంచల్ తన ఎక్స్‌ (X) ఖాతాలో ఈ ఘటనను షేర్ చేశాడు. అతను సూట్‌కేస్‌తో మెట్రోలో ఎక్కుతుండగా, మెట్రో సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. తన లగేజీ పరిమితిని మించి ఉందని, అదనంగా రూ. 30 చెల్లించాలి అని పట్టుబట్టారు. దీంతో సిబ్బంది, ప్రయాణికుడి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. కానీ సిబ్బంది వెనక్కి తగ్గలేదు. చివరికి చేసేది లేక అతను రూ. 30 చెల్లించి టికెట్ తీసుకున్నాడు.

ఈ ఘటనతో బాధపడిన అవినాష్ వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లగేజీ ఛార్జ్ టికెట్ ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ పోస్ట్ వెంటనే వైరల్ అవడంతో, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు “సరైన నిబంధన” అంటుండగా, మరికొందరు “ప్రజలకు భారంగా మారుస్తున్నారు” అని విమర్శిస్తున్నారు.

ఇప్పటికే దేశంలోనే అత్యంత ఖరీదైన మెట్రోగా పేరున్న నమ్మ మెట్రో, ఇప్పుడు లగేజీ ఛార్జ్‌లతో మరింత విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రయాణికుల సౌకర్యం కోసం రూపొందించబడిన మెట్రో, ఇలాంటి అదనపు ఛార్జీలతో ప్రజలకు భారమైపోతుందా అనే చర్చ మొదలైంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *