Viral Video: బైక్‌పై అంత మందిని ఎలా ఎక్కించావ్ మావా!

Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అవి మన ఊహకు కూడా అందని విధంగా ఉంటాయి. స్టంట్స్‌, ప్రమాదాలు, విన్యాసాలు, వినూత్న ఆలోచనలు ఇలా ఎన్నో వీడియోలు నెట్‌లో షేర్ అవుతాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఒక బైకర్ తన బైక్‌పై బాహుబలి స్టైల్లో డజన్ల మంది ప్రయాణికులను ఎక్కించుకుని రోడ్డుపై దూసుకెళ్లాడు. ఈ వీడియో చూసినవాళ్లందరూ షాక్ అయ్యారు.

Viral Video: వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి రిక్షాలో కూర్చుని రోడ్డుపై అద్భుత దృశ్యాలను కెమెరాలో బంధిస్తున్నాడు. ఆ సమయంలో పక్కనే ఒక ప్రత్యేకమైన బైక్ కనిపించింది. ఆ బైక్ వెనుక ఇద్దరు మహిళలు కూర్చున్నారు. వారి వెనుక చిన్న కారు లాంటి జుగాడ్ వాహనం జత చేసి, అందులో అర డజను పిల్లలు కూర్చున్నారు. ఇలా మొత్తం డజనుకు పైగా ప్రయాణికులు ఒకే బైక్‌పై ఉన్నారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

ఈ వీడియోను @usphira166492 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది. ఇప్పటికే మిలియన్ల వ్యూస్‌ సంపాదించుకుంది. వేలాది కామెంట్లు వచ్చాయి. కొందరు ఈ జుగాడ్‌ను ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ఇంతమంది ఒకే వాహనంపై కూర్చోవడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించబడిందో ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, జుగాడ్ విషయంలో భారతీయులకు కొరత లేదని మరోసారి నిరూపితమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *