Good News: పండగకు ముందే జీతం.. ఉద్యోగులకు శుభవార్త!

Good News: కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పండగ కానుకను అందించింది. ఆగస్టు నెల జీతం, పెన్షన్‌ను గణపతి, ఓనం పండుగలకు ముందే విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు పండగ సమయంలో ఆర్థిక భారం లేకుండా సంతోషంగా వేడుకలు జరుపుకునేలా సహకరించనుంది.

Good News: ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం, మహారాష్ట్రలో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులు ఆగస్టు 26, 2025న తమ జీతాన్ని పొందనున్నారు. ఇందులో రక్షణ, పోస్టల్, టెలికాం వంటి విభాగాల ఉద్యోగులు కూడా ఉంటారు. ఈసారి గణపతి పండుగ ఆగస్టు 27న ఉండటంతో, ఉద్యోగులు సౌకర్యంగా పండుగ జరుపుకోవడానికి ముందుగానే జీతం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

కేరళలో ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పటికే ఆగస్టు 25, 2025న తమ జీతం, పెన్షన్‌ను పొందారు. ఓనం పండుగకు ముందు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 21న ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదలైంది.

ప్రభుత్వం తెలిపినట్లుగా, నెల ముగిసిన తర్వాత సరైన గణన జరుగుతుంది. అవసరమైతే జీతాల్లో సర్దుబాటు చేస్తారు. అలాగే జీతం చెల్లింపులపై పూర్తి సమాచారాన్ని బ్యాంకులు వెంటనే అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ఆదేశించింది. దీని వల్ల డబ్బు ఉద్యోగుల ఖాతాల్లో సమయానికి చేరుతుంది.

ఈ నిర్ణయం పండుగల సమయంలో ఉద్యోగులు ఎదుర్కొనే ఆర్థిక సమస్యలకు పెద్ద ఊరటగా నిలిచింది. కుటుంబ ఖర్చులను భరించడంలో సాయం చేయడమే కాకుండా పండగ సంబరాలను మరింత ఆనందభరితంగా మార్చనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *