Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఎంపికలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ స్నేహితుడు, ముంబై ఇండియన్స్ తరపున ఆడిన తిలక్ వర్మ గురించి చర్చ మొదలైంది. గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ ఎంపిక కమిటీలలో ఉండటంతో అతనికి అవకాశమిచ్చారు. కానీ యూఏఈ పరిస్థితుల్లో అతనికి ఆడటం కష్టమని నిపుణులు అంటున్నారు.
Asia Cup 2025: యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని జట్టులో యువ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించనున్నారు. తిలక్ వర్మ ఇప్పటివరకు టీ20ల్లో 25 మ్యాచ్లు ఆడి, 155 స్ట్రైక్ రేట్తో 749 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో కూడా అతను 54 మ్యాచ్లు ఆడి, 1499 పరుగులు చేశాడు.
అయితే నంబర్-3 స్థానంలో శుభ్మన్ గిల్ను ఆడించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. గిల్ ఇప్పటికే టీ20 ఫార్మాట్లో వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ జట్టులో ఉన్నప్పటికీ, ఫైనల్ ప్లేయింగ్-11లో అతనికి స్థానం దక్కుతుందా అన్నది అనుమానంగానే ఉంది.
భారత జట్టు స్క్వాడ్లో సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షదీప్ సింగ్ ఉన్నారు.
ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ లకు అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు
