Viral Post: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రీల్స్ చేసే క్రమంలో ఊహించని సంఘటనలు జరిగి ఫన్నీ సీన్లుగా మారుతుంటాయి. అలాంటి వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఒక అమ్మాయి రీల్ కోసం చేసిన డ్యాన్స్ మధ్యలో కొండముచ్చు కలుగజేసుకొని సీన్ మొత్తాన్ని మార్చేసింది.
Viral Post: ఒక అమ్మాయి కెమెరా ముందు డ్యాన్స్ చేస్తూ రీల్ షూట్ చేయాలని ప్లాన్ చేసింది. గోడపై కూర్చుని ఉన్న కొండముచ్చు ఆమెను ఆసక్తిగా గమనించింది. అమ్మాయి చేతులు ఊపుతూ డ్యాన్స్ చేస్తుండగానే ఒక్కసారిగా కొండముచ్చు జట్టు పట్టుకుని తనవైపు లాగేసింది. షాక్కు గురైన అమ్మాయి వెంటనే వెనక్కి తిప్పుకుని జుట్టు వదిలించుకోవడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే ప్లాన్ చేసిన రీల్ మొత్తం పాడు అయిపోయింది. చివరికి అమ్మాయి కూడా కొండముచ్చుకి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
अब तो जानवर भी परेशान को गए है
इन रीलबाजों से।
यकीन न आए तो वीडियो देखें।
😹😹😹😹😹😹😹 pic.twitter.com/5qR2Yi7wX9— Eshika (@syadvada169665) August 19, 2025
ఈ వీడియో షేర్ కావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. యూజర్లు కూడా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఒకరు “నువ్వు కోతి దగ్గరకు ఎందుకు వెళ్ళావు” అని రాస్తే, ఇంకొకరు “అయ్యో నీ జుట్టు చెడిపోయింది” అంటూ సెటైర్ వేశారు. మొత్తానికి ఈ వీడియో చూసినవారంతా గట్టిగా నవ్వుకుంటున్నారు.
