TG Govt: నిరుద్యోగులకు శుభవార్త.. విభాగాల వారీగా పోస్టుల వివరాలు!

TG Govt: తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1623 వైద్యుల ఖాళీలు భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో 1616 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు టీవీవీపీ (Telangana Vaidya Vidhana Parishad) ఆసుపత్రుల్లో, అలాగే RTC ఆసుపత్రుల్లో 7 పోస్టులు భర్తీ కానున్నాయి.

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 8 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆగస్ట్‌ 22 వరకు సమర్పించుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ఒక్కో పోస్టుకు విడిగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

జోన్‌ల వారీగా ఖాళీలు

ఈ భర్తీలు జోన్‌ల వారీగా నిర్వహించనున్నారు.

  • మల్టీజోన్‌ – 1: 858 పోస్టులు

  • మల్టీజోన్‌ – 2: 765 పోస్టులు

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ పోస్టులకు ఎంపికైన వైద్యులు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయడానికి అనుమతి ఉండదని స్పష్టంగా పేర్కొన్నారు.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు

  • గైనకాలజీ – 247

  • ఎనస్తీషియా – 226

  • పీడియాట్రిక్స్ – 219

  • జనరల్‌ సర్జన్ – 174

  • జనరల్‌ మెడిసిన్ – 166

  • పాథాలజీ – 94

  • ఆర్థోపెడిక్స్ – 89

  • రేడియాలజీ – 71

  • ఫోరెన్సిక్‌ మెడిసిన్ – 62

  • పల్మనరీ మెడిసిన్ – 58

  • సైకియాట్రి – 47

  • ఆప్తమాలజీ – 38

  • డెర్మటాలజీ – 31

  • హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్ – 24

  • బయోకెమిస్ట్రీ – 8

  • మైక్రోబయాలజీ – 8

ఇప్పటికే కాంట్రాక్టు విధానంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారికి 20 పాయింట్లు అదనపు వెయిటేజ్ ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *